English | Telugu

'దసరా' దర్శకుడితో అల్లు అర్జున్!

'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప-2'తో బిజీగా ఉన్నాడు. 'పుష్ప-2' తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా బన్నీ ఓ సినిమా చేసే అవకాశముందని తెలుస్తోంది.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'దసరా'తో శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన దసరా మూవీ వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొదటి సినిమాతోనే శ్రీకాంత్ దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. ఆయన స్టార్ హీరోలను, కమర్షియల్ సినిమాలను డీల్ చేయగలడనే నమ్మకాన్ని సంపాదించుకోగలిగాడు. అందుకేనేమో ఆయనకు ఏకంగా అల్లు అర్జున్ నుంచి పిలుపు వచ్చిందని న్యూస్ వినిపిస్తోంది.

బన్నీ, శ్రీకాంత్ మధ్య ఇప్పటికే కథా చర్చలు జరిగాయట. శ్రీకాంత్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చి, దానిని డెవలప్ చేయమని బన్నీ చెప్పినట్లు సమాచారం. ఫైనల్ స్క్రిప్ట్ బన్నీకి నచ్చితే శ్రీకాంత్ దర్శకత్వంలో ఆయన సినిమా ఉండటం ఖాయమనే అంటున్నారు. 'పుష్ప' సినిమాలో పుష్పరాజ్ పాత్రలో బన్నీ ఒదిగిపోయిన తీరుని అంత తేలికగా మరచిపోలేము. రా లుక్ లో నేచురల్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇక శ్రీకాంత్ సైతం 'దసరా'లో తన రా మేకింగ్ తో ఆకట్టుకున్నాడు. అలాంటిది ఈ ఇద్దరు కలిస్తే అవుట్ పుట్ అదిరిపోతుంది అనడంలో సందేహం లేదు.