English | Telugu
మరో మెగా హీరోతో బుట్టబొమ్మ!?
Updated : Jul 10, 2023
మెగా కాంపౌండ్ లో చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు చేసిన కథానాయికల్లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో 'డీజే', 'అల వైకుంఠపురములో'.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'రంగస్థలం' (స్పెషల్ సాంగ్), 'ఆచార్య'.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో 'ముకుంద', 'గద్దలకొండ గణేష్' సినిమాలు చేసింది పూజ. వీటిలో 'ముకుంద', 'ఆచార్య' మినహా మిగిలివన్నీ కమర్షియల్ గా రాణించాయి.
ఇదిలా ఉంటే, పూజ మరో మెగా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోనుందని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. 'సుప్రీమ్' స్టార్ సాయి ధరమ్ తేజ్. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించనున్న మాస్ ఎంటర్టైనర్ లో సాయి ధరమ్ తేజ్ కి జోడీగా పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి.. సాయి ధరమ్ తేజ్ - పూజా హెగ్డే జంట ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. త్వరలోనే సాయి తేజ్ - సంపత్ నంది కాంబో మూవీలో పూజ ఎంట్రీపై స్పష్టత రానుంది.
కాగా, సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం 'బ్రో' ఈ నెల 28న థియేటర్స్ లోకి రానుంది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ రోల్ లో దర్శనమివ్వనున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన కేతికా శర్మ కనిపించబోతోంది.