English | Telugu
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామ్ చరణ్!
Updated : Jun 21, 2023
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేసే అవకాశముందని న్యూస్ వినిపిస్తోంది.
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా 'భగవంత్ కేసరి' సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరాకు విడుదల కానుంది. ఇదిలా ఉంటే దీని తర్వాత అనిల్ చూపు పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై పడినట్లు తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కోసం అనిల్ రెండు కథలను సిద్ధం చేస్తున్నారట. వీటిలో ముందుగా చరణ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది అంటున్నారు. చరణ్ సైతం అనిల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ నచ్చితే 'గేమ్ ఛేంజర్', బుచ్చిబాబు ప్రాజెక్ట్ తర్వాత చరణ్ చేయబోయే ప్రాజెక్ట్ ఇదే అవ్వొచ్చని వినికిడి.
ఎన్టీఆర్ విషయానికొస్తే కొరటాల శివ డైరెక్షన్ లో 'దేవర' చేస్తున్నారు. ఆ తర్వాత 'వార్-2', ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. మరి ఇవి పూర్తయ్యాక అనిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాలి.