English | Telugu
'గుంటూరు కారం'లో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్!
Updated : Jul 10, 2023
'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొదట మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డేని, సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారు. అయితే షూటింగ్ ఆలస్యం వంటి కారణాలతో పూజ హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో మహేష్ సరసన మెయిన్ హీరోయిన్ గా నటించే అవకాశం శ్రీలీలను వరించింది. ఇక సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఇందులో పూజ హెగ్డే కూడా భాగం కానుందని అంటున్నారు.
'గుంటూరు కారం' కోసం పూజ హెగ్డేకి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చేశారట. అయితే ఆ అడ్వాన్స్ ని వెనక్కి తీసుకోకుండా ఆమెని కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ముందుగా ఈ సాంగ్ కోసం ఇతర హీరోయిన్ల పేర్లను పరిశీలించారట. అయితే ఇప్పుడు పూజ హెగ్డే చేతనే స్పెషల్ సాంగ్ చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారని సమాచారం. గతంలో పూజ హెగ్డే 'రంగస్థలం', 'ఎఫ్ 3' వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయగా, అందులో 'రంగస్థలం' ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు 'గుంటూరు కారం'తో పూజ హెగ్డే మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.