English | Telugu
రామ్ చరణ్ వర్సెస్ విజయ్ సేతుపతి!?
Updated : Jul 10, 2023
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే దక్షిణాది నటుల్లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒకరు. స్వతహాగా తమిళ నటుడైన విజయ్.. తెలుగులోనూ 'సైరా.. నరసింహారెడ్డి', 'ఉప్పెన', 'మైఖేల్' వంటి చిత్రాల్లో సందడి చేశారు. వీటిలో 'ఉప్పెన' లో విజయ్ పోషించిన విలన్ పాత్ర కోటగిరి శేష రాయణం.. ఆ సినిమాకే ఎస్సెట్ గా నిలిచింది. కట్ చేస్తే.. త్వరలో మరో టాలీవుడ్ మూవీలో మిస్టర్ సేతుపతి ఎంటర్టైన్ చేయనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నుంచి పట్టాలెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందించనున్నారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. శక్తిమంతమైన ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతిని నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. 'ఉప్పెన'లోని విలన్ పాత్రకి మించి బుచ్చిబాబు ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేశారని టాక్. త్వరలోనే రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబో ఫిల్మ్ లో విజయ్ సేతుపతి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.