English | Telugu
ప్రభాస్, సుకుమార్ కాంబోలో మూవీ!
Updated : Jun 14, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ శుక్రవారం 'ఆదిపురుష్' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాతో ఆయన 'బాహుబలి' స్థాయి సంచలనాలు సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి. కాగా ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 'సలార్', 'ప్రాజెక్ట్ కె', మారుతి ప్రాజెక్ట్, 'స్పిరిట్' వంటి చిత్రాలు ఉన్నాయి. తాజాగా ప్రభాస్ మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించనున్నారని న్యూస్ వినిపిస్తోంది.
'పుష్ప-1'తో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్.. ప్రస్తుతం 'పుష్ప-2'తో బిజీగా ఉన్నారు. 'పుష్ప-2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత సుకుమార్ రేంజ్ మరో స్థాయికి వెళ్తుందనే అభిప్రాయాలున్నాయి. అయితే సుకుమార్ దర్శకుడిగానే కాకుండా, సుకుమార్ రైటింగ్స్ పేరుతో బ్యానర్ స్థాపించి తాను రచయితగా వ్యవహరిస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామ్యంతో వచ్చిన మెజారిటీ సినిమాలు విజయాలు సాధించాయి. అయితే ఇప్పటివరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాల నిర్మాణంలో పాలుపంచుకున్న సుకుమార్.. ఇప్పుడు ప్రభాస్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేయరట. సుకుమార్ కథ అందిస్తున్న ఈ సినిమాకి ఆయన శిష్యుడు దర్శకత్వం వహిస్తారట.