ఎన్నికల్లో ప్రభంజనం.. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు!
నటరత్న ఎన్.టి.రామారావు తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన సినిమా ‘మనదేశం’. ఈ సినిమా 1949లో విడుదలైంది. అలాగే ఆయన చివరగా నటించే సినిమా అంటూ ప్రచారం పొందిన సినిమా ‘నా దేశం’. ఈ సినిమా 1982లో విడుదలైంది. ఎన్టీఆర్ జీవితంలో 1982 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. ఈ ఒక్క సంవత్సరంలోనే జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, నాదేశం.. ఈ మూడు సినిమాలు రిలీజ్ అయి ఘనవిజయం సాధించాయి.