English | Telugu

 డైరెక్టర్ గా సక్సెస్ అవుతావా అని అడిగారు అల్లు అరవింద్....

  బుల్లితెర ఆడియన్స్ కి సినీ సెలెబ్స్ విషయాలు అందిస్తూ ఎంటర్‌టైన్  చేస్తున్న అలా మొదలైంది షో ప్రతీ వారం హంగామా చేస్తోంది. వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి డైరెక్టర్ మారుతి-స్పందన  వచ్చి వాళ్ళ జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను చెప్పారు.  "సాధనను పెళ్లి చేసుకోవడానికి ముందే వాళ్ళ పెద్దవాళ్ళు కండిషన్స్ పెట్టారు. మూవీ డైరెక్షన్ చేస్తాను అంటే పిల్లను ఇవ్వం అన్నారు. నేను ఎప్పుడూ సినిమాలు, డైరెక్షన్ గురించే మాట్లాడేసరికి వాళ్లకు కూడా అర్థమైపోయింది. సినిమా డైరెక్షన్ అంటే అంత ఈజీ కాదు వెళ్లి కృష్ణానగర్ లో తిరుగుతానేమో అనుకున్నారు. అలా వాళ్ళ కండిషన్స్ కోసం  తర్వాత చాలా జాబ్స్ చేసాను...ఏ పని వచ్చిన అది చేసుకుంటూ వెళ్లాను. డైరెక్టర్ కావడానికి నాకు చాలా టైం పట్టింది. మొదట్లో  నేను స్టోరీ బోర్డులు వేసేవాడిని, టైటిల్స్ రాసేవాడిని..ఆ టైములో నేను బన్నీని దగ్గర నుంచి చూసాను. గంగోత్రి సినిమాకంటే ముందు నుంచి నాకు బాగా తెలుసు. బన్నీ కూడా డ్రాయింగ్ నేర్చుకునేవాడు. అదే టైంలోనే నేను అరవింద్ గారి దగ్గరకు వెళ్లి డైరెక్టర్ అవుదామనుకుంటున్న అని చెప్పను.

 జూన్ 3 న డల్లాస్ లో కలుద్దాం...మజా చేద్దాం...వచ్చేయండి అంటున్న అష్షు

అష్షు రెడ్డి టిక్ టాక్ స్టార్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అందాల తార. ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు అందరికి తెలిసిందే..ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటో షూట్స్ లో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయ్యింది. నెట్టింట్లో అష్షు హడావిడి అంతా ఇంతా కాదు. రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ రెగ్యులర్ అప్ డేట్స్ ని కూడా తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ మధ్య అమ్మడు ఫారెన్ టూర్స్ ఎక్కువగా చేస్తూ కనిపిస్తోంది. ఈవెంట్స్, షోస్ కోసం అక్కడికి వెళ్లడం అక్కడ ఫొటోస్, వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు తన న్యూ అప్ డేట్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసింది. "నా బిగ్గెస్ట్ ఫేవరేట్ సిటీ ఐన డల్లాస్ లో త్వరలో బ్యాండ్ ఎలీజియం అనే ఒక పెద్ద కన్సర్ట్ ని హోస్ట్ చేయబోతున్నాను.

 చిన్నప్పుడు సుమంగళి చేసిన కొంటె పని తెలుసా...

ఖడ్గం మూవీలో "నువ్వు నువ్వు" సాంగ్ పాడి ఫేమస్ ఐన సింగర్ సుమంగళి. ఈమె దేవిశ్రీప్రసాద్ తో కలిసి దేవి మూవీలో "నీ నవ్వే నాగస్వరమే" అనే సాంగ్ కూడా పాడింది. చూడడానికి చాలా చిన్న పిల్లలా కనిపిస్తుంటుంది. ఇప్పుడు జీ సరిగమప షోలో లిటిల్ చాంప్స్ టీంని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు మెంటార్ గా ఉంది. ఇక ఈ వారం జీ సరిగమప షోలో సుమంగళి తన టీమ్ తో కలిసి పెర్ఫార్మ్ చేసింది. దాని తర్వాత  చిన్నప్పుడు తాను చేసిన ఒక కొంటె పని గురించి చెప్పింది. పిల్లలతో పెర్ఫార్మెన్స్ పూర్తయ్యాక బ్యాక్ గ్రౌండ్ లో సుమంగళి చిన్నప్పటి ఫోటోని ప్లే చేశారు. అందులో సుమంగళితో పాటు ఒక అబ్బాయి కూడా కనిపించాడు.  దాంతో ప్రదీప్ ఈ ఫోటో వెనక  ఉన్న స్టోరీ ఏమిటి ..అతను ఎవరు అని అడిగేసరికి "ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అలా చెప్పొచ్చు. మేము చిన్నప్పుడు మస్కట్ లో ఉండేవాళ్ళం.

సెమీఫైనల్స్ కి చేరుకున్న ఢీ..పోటాపోటీగా తలపడిన కంటెస్టెంట్స్

ఢీ ఛాంపియన్ షిప్ బాటిల్ సెమి ఫైనల్స్ కి చేరుకుంది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో కంటెస్టెంట్ చేసిన పెర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పొచ్చు. ఈ వారం సెమీఫైనల్స్ లో కంటెస్టెంట్స్ మధ్య పోటీ చాల టఫ్ గా ఉంది. ఐతే ఈ ఢీ స్టేజి మీద  గ్రీష్ణ, సోమేష్, రేవంత్, కుమార్, పండు, చైతన్య వాళ్ళ వాళ్ళ కంటెస్టెంట్స్ ని మంచిగా ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. "కొండాకాకి" అనే సాంగ్ కి కంటెస్టెంట్ రేవంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసాడు. "నీ ఎక్స్ప్రెషన్స్ అమేజింగ్" అంది జడ్జి శ్రద్ద. "అందరికంటే రేవంత్ మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు" అన్నాడు కొరియోగ్రాఫర్ పండు.

రిషి, వసుధారలకి తప్పిన ప్రమాదం.. అంతా శైలేంద్ర మాస్టర్ ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -760 లో.. రిషి, వసుధారలు కలిసి సంతోషంతో ఎంగేజ్ మెంట్ షాపింగ్ కి వెళ్లాలనుకుంటారు. నువ్వేం షాపింగ్ చేస్తావ్.. నేను మనకి టు రింగ్స్ తీసుకోవాలనుకుంటున్న.. ఒకటి VR లెటర్స్ తో ఉండేది.. ఇంకొకటి ఏంటో చెప్పమని రిషి వసుధారని అడుగుతాడు. మీరే చెప్పండి సర్ అని వసుధార అంటుంది. ఇంకొకటి RV లెటర్ రింగ్ అని రిషి అంటాడు. రెండు ఒకటే కదా సర్.. తేడా ఏముంది.. డిఫరెంట్ గా ఉండాలి. RD లెటర్ రిషిధార ఇలా ఉండాలని వసుధార అంటుంది. దానికి రిషి సరే అంటాడు. వసుధార చేతి పైన RD అని రాసి తన చేతిని ముద్దుపెట్టుకుంటాడు రిషి.

క్లాస్, మాస్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న అషు రెడ్డి!

అషు రెడ్డి.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు అషు పెద్దగా పరిచయం లేని పేరు. బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ తో పాటు తనకంటూ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఆర్జీవీతో అషురెడ్డి కలిసి చేసిన ఒక వీడియో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో ఈ వీడియో గురించి నెటిజన్ల నెగటివ్ కామెంట్స్ తో పెద్ద డిబేటే జరిగింది. అంతేకాకుండా మరోసారి ఒక కాఫీ షాప్ లో అషురెడ్డి పొట్టి డ్రెస్ లో కూర్చొని ఉండగా.. ఆర్జీవీ తన థైస్ ని బాగున్నాయని అనగా, ఆమె చెంపమీద కొట్టడంతో ఆ ఇంటర్వ్యూ  కూడా అప్పట్లో వైరల్ అయింది.

సీరియల్స్ ఎందుకు మానేయాల్సి వచ్చిందంటే....?

బుల్లితెర మీద దుర్గ గద్దె వచ్చిన కొద్దిరోజుల్లోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఐతే ఇప్పుడు ఆమె బుల్లితెర సీరియల్స్ నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంది. కానీ ఎందుకు తప్పుకుంది.. కారణమేంటి అంటూ చాలామంది అడుగుతుండేసరికి ఆ విషయాల గురించి ఒక వీడియోలో తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది " నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. ముందు సినిమాల వైపు వెళ్లాను. నేను నటించిన ఫస్ట్ మూవీ అల్లరే  అల్లరి.  బుల్లితెర మీద నటించిన ఫస్ట్ సీరియల్ అపరంజి. అలా ఇండస్ట్రీలోకి వచ్చాక  నేను డబ్బింగ్ కార్డు, ఆర్టిస్ట్ కార్డు కూడా సంపాదించుకున్నాను. ఒక పక్కన చదువుకుంటూనే మరో వైపు వచ్చిన  సీరియల్స్ అన్నీ చేసుకుంటూ వచ్చాను. నా లాస్ట్ ప్రాజెక్ట్స్ సావిత్రమ్మ గారి అబ్బాయి, బంగారు పంజరం.