Read more!

English | Telugu

 చిన్నప్పుడు సుమంగళి చేసిన కొంటె పని తెలుసా...

ఖడ్గం మూవీలో "నువ్వు నువ్వు" సాంగ్ పాడి ఫేమస్ ఐన సింగర్ సుమంగళి. ఈమె దేవిశ్రీప్రసాద్ తో కలిసి దేవి మూవీలో "నీ నవ్వే నాగస్వరమే" అనే సాంగ్ కూడా పాడింది. చూడడానికి చాలా చిన్న పిల్లలా కనిపిస్తుంటుంది. ఇప్పుడు జీ సరిగమప షోలో లిటిల్ చాంప్స్ టీంని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు మెంటార్ గా ఉంది. ఇక ఈ వారం జీ సరిగమప షోలో సుమంగళి తన టీమ్ తో కలిసి పెర్ఫార్మ్ చేసింది. దాని తర్వాత  చిన్నప్పుడు తాను చేసిన ఒక కొంటె పని గురించి చెప్పింది. పిల్లలతో పెర్ఫార్మెన్స్ పూర్తయ్యాక బ్యాక్ గ్రౌండ్ లో సుమంగళి చిన్నప్పటి ఫోటోని ప్లే చేశారు. అందులో సుమంగళితో పాటు ఒక అబ్బాయి కూడా కనిపించాడు.  దాంతో ప్రదీప్ ఈ ఫోటో వెనక  ఉన్న స్టోరీ ఏమిటి ..అతను ఎవరు అని అడిగేసరికి "ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అలా చెప్పొచ్చు. మేము చిన్నప్పుడు మస్కట్ లో ఉండేవాళ్ళం.

అక్కడ నేను చదివే స్కూల్లో ఉండేవాడు. అతని పేరు ఇర్ఫాన్. పాకిస్తానీ. ప్లే గ్రౌండ్ లో ఆడుకునేటప్పుడు అతన్ని గట్టిగా ముద్దుపెట్టుకోవడం కోసం  నేను అతని వెనక పడి పట్టుకుందామని పరిగెట్టేదాన్ని. ఎందుకంటే అతను చాలా ఫెయిర్ గా ఉంటాడు. ముద్దుపెట్టుకునేటప్పుడు అతని చెవి మొత్తం పింక్ ఐపోతుంది. అది చూడడం నాకు ఒక ఫాసినేషన్. అందుకే అతన్ని పట్టుకుని ముద్దుపెట్టుకోవడం కోసం అతని వెనకాలే పెరిగెడుతూ ఉండేదాన్ని. ఐతే ఈ ఫోటో స్కూల్  యాన్యువల్ డే రోజున డాన్స్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటో. ఆ అబ్బాయి ఫేస్ చూసారా నన్ను చూసి చాల భయపడిపోయి దూరం పారిపోతున్నాడు ఎక్కడ మళ్ళీ ముద్దుపెట్టుకుంటానో అని..కానీ నా కళ్ళల్లో చూసారా ప్రేమ కనిపిస్తోంది..ఇప్పుడెక్కడ ఉన్నాడో తెలీదు. ఇర్ఫాన్ నువ్వెక్కడ ఉన్నావో తెలీదు కానీ నువ్వు మంచిగా ఉన్నావనుకుంటున్నా. సెటిల్ ఐపోయి హ్యాపీగా ఉన్నావనుకుంటున్నా" అని చెప్పింది సుమంగళి. "చూసి నేర్చుకోండి పృద్వి, సాకేత్..అని అన్నాడు ప్రదీప్..మేం నేర్చుకున్నాం..అందుకే పెళ్లిళ్లు అయ్యాయి.  మీరే నేర్చుకోవాలి. అని సాకేత్ అనేసరికి ఓహ్ పెళ్లిళ్లు అయ్యాయా.. సారీ అంకల్స్" అని కామెడీ చేసాడు ప్రదీప్.