Read more!

English | Telugu

రిషి, వసుధారలకి తప్పిన ప్రమాదం.. అంతా శైలేంద్ర మాస్టర్ ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -760 లో.. రిషి, వసుధారలు కలిసి సంతోషంతో ఎంగేజ్ మెంట్ షాపింగ్ కి వెళ్లాలనుకుంటారు. నువ్వేం షాపింగ్ చేస్తావ్.. నేను మనకి టు రింగ్స్ తీసుకోవాలనుకుంటున్న.. ఒకటి VR లెటర్స్ తో ఉండేది.. ఇంకొకటి ఏంటో చెప్పమని రిషి వసుధారని అడుగుతాడు. మీరే చెప్పండి సర్ అని వసుధార అంటుంది. ఇంకొకటి RV లెటర్ రింగ్ అని రిషి అంటాడు. రెండు ఒకటే కదా సర్.. తేడా ఏముంది.. డిఫరెంట్ గా ఉండాలి. RD లెటర్ రిషిధార ఇలా ఉండాలని వసుధార అంటుంది. దానికి రిషి సరే అంటాడు. వసుధార చేతి పైన RD అని రాసి తన చేతిని ముద్దుపెట్టుకుంటాడు రిషి.

మరొకవైపు శైలేంద్ర మాటలన్నీ గుర్తు చేసుకుంటు బాధపడుతుంది జగతి. అప్పుడే శైలేంద్ర వచ్చి.. పిన్ని అంతగా ఏం ఆలోచిస్తున్నారు. మీరు కూడా షాపింగ్ కి వెళ్లొచ్చు కదా అని శైలేంద్ర అనగానే.. నువ్వు ఏం ఆశించి ఈ ఎంగేజ్మెంట్ జరగాలని చెప్పావ్ అని శైలేంద్రని జగతి  అడుగుతుంది. మీరేంటి అలా అడుగుతున్నారు.. వాళ్ళని ఒకటి చెయ్యాలని నేను అనుకుంటే.. మీరు అలా అంటున్నారేంటని శైలేంద్ర అంటాడు. ప్లీజ్ శైలేంద్ర అసలేం చెయ్యాలనుకుంటున్నావని జగతి అడుగుతుంది.. నాకు తెలుసు పిన్ని.. నీకు రిషి అంటే చాలా ఇష్టమని.. నాకు ఇవ్వాలిసింది రిషి ప్రాణాలు కాదు.. వాడు కూర్చొనే ఎండి సీట్.. అంతే గాని రిషికి హాని తలపెట్టాలని కాదని శైలేంద్ర అంటాడు.

షాపింగ్ కి వెళ్దాం పదా అంటూ జగతిని తనతో పాటు తీసుకెళ్తాడు శైలేంద్ర. మరొకవైపు చూసావా వసుధార.. మా అన్నయ్య మన గురించి అలోచించి, మనకు సపోర్ట్ గా మాట్లాడి.. ఒకటి చెయ్యాలని చూసాడు. నువ్వేమో అన్నయ్య గురించి తప్పుగా అనుకుంటావని వసుధారతో రిషి అంటాడు. మరొకవైపు శైలేంద్ర, జగతిలు కూడా  రిషి, వసుధారల కార్ వెనకాలే వస్తారు. శైలేంద్ర ఒక అతనికి ఫోన్ చేసి లారీ తీసుకొని రా అని చెప్తాడు.

వెంటనే లారీతో వచ్చిన వ్యక్తి రిషి కార్ కి డాష్ ఇవ్వడానికి వస్తుంటాడు.. అదంతా లారీ డ్రైవర్ తో శైలేంద్ర మాట్లాడుతుంటే.. జగతి, రిషి వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని బయపడుతుంది. కానీ శైలేంద్ర ఆ లారీని పక్కకి తప్పించు అనగానే లారీ పక్క నుండి వెళ్ళిపోతుంది. రిషి, వసుధారలు భయంతో కార్ పక్కకి ఆపుతారు. వెంటనే జగతి శైలేంద్ర కార్ లో నుండి దిగి.. రిషి దగ్గరికి వచ్చి మీకేం కాలేదుగా అంటూ ఏడుస్తుంది. శైలేంద్ర ఏం తెలియనట్టుగా ఆ లారీ డ్రైవర్ అలా చేసాడేంటూ యాక్ట్ చేసాడు. శైలేంద్ర వైపు కోపంగా చూస్తుంది జగతి.

ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. అక్కడ జరిగింది చెప్పగానే రిషికి శత్రువులు ఎక్కువయ్యారు. దీన్ని చిన్న విషయంగా తీసుకోవద్దని ఫణింద్ర అంటాడు. జగతి తన గదిలో బాధపడుతుంటే శైలేంద్ర జగతి దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు అగలిసిందే.