Read more!

English | Telugu

జీ సరిగమప స్టేజి మీద అనన్య ఎంగేజ్మెంట్...మణిశర్మ ఘన సన్మానం

జీ సరిగమప ఛాంపియన్ షిప్ గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక నెక్స్ట్ వీక్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ కి స్వర బ్రహ్మ మణిశర్మ వచ్చారు. "పాటల పోటీ చూసాను కానీ పాటల యుద్ధం చూడలేదు అన్నారు. ఇక ఈ షోలో ఒక కంటెస్టెంట్ అనన్య ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. "తేజ..నాకు కాబోయే భర్త..ఎనిమిదేళ్ల నుంచి మేము ఒకరికొకరం బాగా తెలుసు. అతన్ని నా లైఫ్ లో పొందడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని చెప్పింది. మణిశర్మ గారి ఆధర్యంలో తన తోటి కంటెస్టెంట్స్ అందరి సమక్షంలో అనన్య, తేజ ఉంగరాలు మార్చుకున్నారు.

అటు ఇటు పెద్దలు వీళ్లకు హారతి కూడా ఇచ్చారు". అలాగే ఈ షోకి ఉగ్రం మూవీ నుంచి హీరో అల్లరి నరేష్ , మిర్న మీనన్ వచ్చారు. టీం చాలెంజర్స్ ఇచ్చిన రాకింగ్ పెర్ఫార్మెన్స్ కి నరేష్ ఫిదా ఐపోయాడు. "ఎక్కడా కోఆర్డినేషన్ మిస్ కాలేదు...చాలా బాగా పాడారు" అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. లాస్ట్ లో మణిశర్మ గారిని స్టేజి   మీద ఉన్న చిన్నా పెద్దా అందరూ కలిసి గజ మాలను వేసి, షాల్ కప్పి సన్మానించుకున్నారు.  తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న షోస్ లో జీ సరిగమప ఒకటి. ఆల్రెడీ గత ఏడాది  ‘సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ పూర్తి చేసుకుని ఈ ఏడాది "సరిగమప ఛాంపియన్షిప్" పేరుతో స్టార్ట్ ఐన ఈ ప్రోగ్రాం గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది. ఈ కార్యక్రమం మొదలైన తక్కువ కాలంలోనే ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మరి ఈ సంగీత మహాసంగ్రామంలో  ఛాంపియన్ షిప్ టైటిల్ ని విన్ అయ్యేది ఎవరో తెలియాలి అంటే కొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే.