Read more!

English | Telugu

ఎప్పుడైనా కృష్ణ భగవాన్ గారిదే లాస్ట్ పంచ్ అన్న నందిని రెడ్డి

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోకి "అన్ని మంచి శకునములే" మూవీ టీమ్ వచ్చింది. నందిని రెడ్డి, సంతోష్ శోభన్ , మాళవిక నాయర్ ఈ షోలో కాసేపు సందడి చేశారు. "జబర్దస్త్ కి రావడం అంటే నా ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంటుంది" అంది నందిని రెడ్డి. "అందరూ ఇక్కడికి స్కిట్స్ చూడడానికి వస్తారు కానీ నేను మాత్రం స్కిట్స్ ఐపోయాక కృష్ణ భగవాన్ గారు వేసే పంచులు వినడానికి వస్తాను" అన్నాడు సంతోష్ శోభన్.  "ఒరిజినల్ జబర్దస్త్ కింగ్" అని కాంప్లిమెంట్ ఇచ్చింది నందిని రెడ్డి. ఇందులో సద్దాం టీమ్ శివ మూవీ స్పూఫ్ చేశారు కానీ మొత్తం గందరగోళం చేసేసారు.

ఈ షోలో రాకెట్ రాఘవ ఒక స్కిట్ వేసాడు "వెల్కమ్ టు చిల్లర డబ్బులు గేమ్ షో" అని నిర్వహించి అందులోకి ఈ షోకి వచ్చిన గెస్టులను ఇన్వైట్ చేసాడు. "మా గేమ్ షోకి కొన్ని రూల్స్ ఉన్నాయండి ప్రశ్నకు లక్ష రూపాయలు" అని రాఘవ చెప్పేసరికి "మరి జవాబుకు" అని అడిగాడు సంతోష్. "చెక్ బౌన్స్ అవుతుంది మీ కోట్ ఉంది కదా అది ఇచ్చేయండి..నాలుగు క్వశ్చన్స్ వరకు ఉంటారు అన్నాడు. " నాలుగు క్వశ్చన్లకంటే ఎక్కువ లేకపోతే మీకే మంచిది" అని రాఘవను బెదిరించింది నందినిరెడ్డి. తర్వాత సంతోష్ జడ్జి సీట్ దగ్గరకు వెళ్లి "చూసారా ఇక్కడికి వచ్చేసరికి ఆటోమేటిక్ గా నవ్వొచ్చేస్తోంది...అంటే ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉంది" అన్నాడు.

ఇంద్రజ గారికి ఆల్రెడీ నవ్వెక్కువా అన్నారు కృష్ణ భగవాన్. పక్కన మీరే ఉన్నారు కదా జడ్జి గారు నవ్వాల్సిందే అంది నందిని..నేను ఉండడం వల్లనే నవ్వు తగ్గింది అన్నారు కృష్ణ భగవాన్. "ఎప్పుడైనా కృష్ణ భగవాన్ గారిదే లాస్ట్ పంచ్" అంది నందిని రెడ్డి. ఇలా ఈ వారం కామెడీ కంటెస్టెంట్స్, కామెడీ జడ్జెస్ తో పాటు కామెడీ గెస్ట్స్ కూడా ఆడియన్స్ ని నవ్వుల్లో ముంచబోతున్నారు.