Read more!

English | Telugu

కావ్యను భార్యగా ఒప్పుకున్న రాజ్.. రాహుల్ కి వార్నింగ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -93 లో.. రాహుల్ గల్లా పట్టుకొని నీలదీస్తాడు రాజ్. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం కదరా.. నాకు ఇంత నమ్మకద్రోహం చేస్తావా అని రాజ్ అడుగుతాడు. నన్ను  చెప్పనివ్వు రాజ్ అని రాహుల్ అనగానే.. ఏం చెప్తావ్ రా? కుటుంబం పరువు తీసానాని చెప్తావా? పెళ్లి కూతురుని లేవదిసుకుపోయానని చెప్తావా అని రాజ్ అంటాడు.

రాహుల్ ఇప్పటికైనా నిజం చెప్పు.. ఇంకా ఎలా తప్పించుకోవాలో చూస్తున్నవా? నువ్వు దొరికిపోయావ్ రాహుల్ అని కావ్య అంటుంది. మరొకవైపు పూజ దగ్గర రాజ్, కావ్య లు ఇంకా రావట్లేదని ఎదురుచూస్తుంటారు. ఇది సంస్కారం.. ఇది పెంపకం.. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పని పాట లేకుండ ఉన్నారా? మీ కూతురు ఇంత మందిని ఎదురు చూసేలా చేస్తుంది. తల్లి ఎలా ఉంటే పిల్లలు అలాగే ఉంటారు అని అనుకుంటూ ఛాన్స్ దొరికినప్పుడల్లా కావ్య ఫ్యామిలీని అవమనిస్తుంటుంది

అపర్ణ. ఏంటి అపర్ణ వెళ్ళింది వాళ్ళ కూతురే కాదు.. మన కొడుకు కూడా ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావని అఒర్ణ భర్త సుభాష్ అంటాడు. మరొకవైపు తింగరి మాటలతో మీనాక్షి అందరికి చిరాకు తెప్పిస్తుంది. నువ్వు ఆవేశపడకు అపర్ణ ఏ పని మీద వెళ్లారో ఏంటో అని ఇందిరాదేవి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా అపర్ణ వినకుండా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది.

నీ కోడలే కాదు కొడుకు కూడా వెళ్ళాడు.. ఒక కోడలు మీద యుద్ధం ప్రకటించిడం కరెక్ట్ కాదు.. ఏదో ముఖ్యమైంది అయితేనే ఇద్దరు వెళ్లారని రుద్రాణి అంటుంది. కావ్యనే రాజ్ ని పక్కకి పిలిచి తీసుకెళ్ళింది. పెళ్లిలో పెద్ద కూతురు వెళ్ళిపోయింది. రెండవ కూతురు ఇలా మధ్యలో వెళ్ళిపోయింది. ఇలాంటి వాళ్లతో సంబంధం వద్దు.‌. ఏం వద్దని అపర్ణ అంటుంది. కొద్దిసేపు వెయిట్ చేద్దామని ఇందిరాదేవి అంటుంది. మరొకవైపు రాజ్ అడిగే ప్రశ్నలకు రాహుల్ మాట దాటే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా చెప్పేది వినేది ఏంటి పెళ్లి జరుగుతున్నప్పుడు.. రాహుల్ అక్కడ ఉండాకుండా ఫైర్ ఆక్సిడెంట్ అని ఆఫీస్ కి వెళ్ళాడా కానీ అక్కడ ఏం జరగలేదు.. మా అక్కని తీసుకెళ్లి హోటల్ లో ఉంచాడని కావ్య అంటుంది.

నువ్వు మధ్యలో మాట్లాడకని కావ్యని రాహుల్ అనగానే.. నువ్వు నోరు ముయ్.. ఇప్పుడు తను నా భార్య తనకు అడిగే హక్కు ఉందని రాజ్ అంటాడు. నీతో లైఫ్ బాగుంటుందని మాయ మాటలు చెప్పి మోసం చేసావ్. తీసుకెళ్లిన వాడివి పెళ్లి చేసుకోకుండా ఎందుకు వచ్చావని రాజ్ అడుగుతాడు. తీసుకెళ్లి మధ్యలో వదిలేసావ్.. ఎక్కడ దిక్కు లేక మా అక్క మళ్ళీ మా ఇంటికే వచ్చిందని కావ్య అంటుంది.

ఆ తర్వాత రాహుల్ కన్నింగ్ గా అలోచించి.. రాజ్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్.. కావ్య తన అక్క కావాలనే ఇదంతా చేస్తున్నారు.. నిన్ను పెళ్లి చేసుకున్నట్లు.. స్వప్న నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అసలు నేను ఇక్కడే ఉన్నట్లు కావ్యకి ఎలా తెలుసని అడుగుతాడు రాహుల్. నాకు ముందు నుంచి వీళ్ళ మీద డౌట్ తో స్వప్నని కనిపెట్టుకుంటూ ఉండమని మా అప్పుకి చెప్పాను.. అప్పు అక్కని ఫాలో అయింది.. వీళ్ళు ఇక్కడ ఉన్న సంగతి నాకు చెప్పిందని కావ్య అంటుంది. కాని రాహుల్ మాత్రం తప్పు నాదేం లేదు.. అంత వీళ్ళదే అన్నట్లు మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.