Read more!

English | Telugu

 తప్పు చేసాను..సూపర్ క్వీన్ షోలో ఏడ్చిన కండక్టర్ ఝాన్సీ

సూపర్ క్వీన్ సీజన్ 2 ప్రతీ వారం కలర్ ఫుల్ గా వచ్చి ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పుడు ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. మదర్స్ డే సందర్భంగా జీ తెలుగులో కనిపించే సూపర్ క్వీన్స్ అంతా వాళ్ళ వాళ్ళ అమ్మల్ని ఈ స్టేజి మీదకు తీసుకువచ్చారు. ఇందులో జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర వాళ్ళ అమ్మకు ముద్దిచ్చి మదర్స్ డే విషెస్ చెప్పింది. "ఏ కూతురు చేయని తప్పు చేసాను..సారీ అమ్మా" అంటూ కండక్టర్ ఝాన్సీ ఈ స్టేజి మీద వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది.

"ఇంటింటి గృహలక్ష్మి" సీరియల్‌లో లేడీ విలన్ రోల్ లో నటించి తులసిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తగ్గించే లాస్య.. రియల్ లైఫ్‌‌లో ఎన్నో ఇబ్బందులు పడింది. ఈ సూపర్ క్వీన్ ప్రోమోలో తన తల్లిని తలుచుకుని ఎమోషనల్ అయ్యింది. వాళ్ళ అమ్మ ఫోటోని చూసి ఇలా చూస్తాననుకోలేదు మా అమ్మను అంటూ  కన్నీటి పర్యంతమయ్యింది.  

థర్డ్ స్టేజ్‌ లివర్ క్యాన్సర్ తో ప్రశాంతి వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం చెప్పి చాలా సార్లు బాధపడింది.. ఇక ఈ షోలో మిగతా సూపర్ క్వీన్స్ కూడా వాళ్ళ వాళ్ళ అమ్మలకు విషెస్ చెప్పి తాము చేసిన తప్పులకు సారీ కూడా చెప్పారు. సూపర్ క్వీన్ 2 రియాలిటీ షో మాత్రమే కాదు మహిళలు తమ జీవితాల్లో ఎదుర్కున్న కష్టాలను చెప్తూ ఎలా వాటిని దాటుకుని వచ్చారో చెప్పే ఇన్స్పిరేషనల్ షో. ఇలాంటి షోలో మద్యమద్యలో   ఫన్నీ టాస్కులు కూడా ఆది మహిళా శక్తిని చాటి చెప్తూ ఉంటారు ఈ సూపర్ క్వీన్స్. ఈ షో చూసే ఆడియన్స్ లో మంచి  స్ఫూర్తి నింపుతోంది.