Read more!

English | Telugu

 డైరెక్టర్ గా సక్సెస్ అవుతావా అని అడిగారు అల్లు అరవింద్....

 

 


బుల్లితెర ఆడియన్స్ కి సినీ సెలెబ్స్ విషయాలు అందిస్తూ ఎంటర్‌టైన్  చేస్తున్న అలా మొదలైంది షో ప్రతీ వారం హంగామా చేస్తోంది. వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి డైరెక్టర్ మారుతి-స్పందన  వచ్చి వాళ్ళ జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను చెప్పారు.  "సాధనను పెళ్లి చేసుకోవడానికి ముందే వాళ్ళ పెద్దవాళ్ళు కండిషన్స్ పెట్టారు. మూవీ డైరెక్షన్ చేస్తాను అంటే పిల్లను ఇవ్వం అన్నారు. నేను ఎప్పుడూ సినిమాలు, డైరెక్షన్ గురించే మాట్లాడేసరికి వాళ్లకు కూడా అర్థమైపోయింది. సినిమా డైరెక్షన్ అంటే అంత ఈజీ కాదు వెళ్లి కృష్ణానగర్ లో తిరుగుతానేమో అనుకున్నారు. అలా వాళ్ళ కండిషన్స్ కోసం  తర్వాత చాలా జాబ్స్ చేసాను...ఏ పని వచ్చిన అది చేసుకుంటూ వెళ్లాను. డైరెక్టర్ కావడానికి నాకు చాలా టైం పట్టింది. మొదట్లో  నేను స్టోరీ బోర్డులు వేసేవాడిని, టైటిల్స్ రాసేవాడిని..ఆ టైములో నేను బన్నీని దగ్గర నుంచి చూసాను. గంగోత్రి సినిమాకంటే ముందు నుంచి నాకు బాగా తెలుసు. బన్నీ కూడా డ్రాయింగ్ నేర్చుకునేవాడు. అదే టైంలోనే నేను అరవింద్ గారి దగ్గరకు వెళ్లి డైరెక్టర్ అవుదామనుకుంటున్న అని చెప్పను.

అప్పుడు ఆయన చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తే..ఎన్నో వేల మంది  డైరెక్టర్లు అవుదామని వస్తారు.. కానీ అసిస్టెంట్లు, అసోసియేట్లు, కో-డైరెక్టర్లు, డైరెక్టర్లు కలుపుకుని నలుగురు మాత్రమే సక్సెస్ అవుతారు. సక్సెస్ అవుతావని నీకు నమ్మకం ఉంటే చెప్పు అని అన్నారు. ఇక అప్పటికి నాకు ఆ నమ్మకం లేక జాబ్ కి వెళ్ళిపోయాను. ఈరోజుల్లో మూవీ కంటే ఐదారేళ్ళ ముందు ఇదంతా జరిగింది. ఆర్య మూవీ నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాను. కొంత డబ్బు అప్పు తీసుకుని "ఏ ఫిలిం బై అరవింద్" మూవీలో పెట్టాను. తర్వాత ప్రొడ్యూసింగ్ చేస్తే డబ్బులు పోతాయని భయపడి అందులో డబ్బులు పెట్టడం మానేసాను. ఇలా చాలా కష్టాలు పడ్డాక "ఈరోజుల్లో" మూవీ తీశాను. ఆ  తర్వాత నుంచి కొంచెం లైఫ్ హ్యాపీగా వెళ్ళింది" అని చెప్పాడు మారుతి.