Read more!

English | Telugu

 జూన్ 3 న డల్లాస్ లో కలుద్దాం...మజా చేద్దాం...వచ్చేయండి అంటున్న అష్షు

 


అష్షు రెడ్డి టిక్ టాక్ స్టార్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అందాల తార. ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు అందరికి తెలిసిందే..ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటో షూట్స్ లో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయ్యింది. నెట్టింట్లో అష్షు హడావిడి అంతా ఇంతా కాదు. రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ రెగ్యులర్ అప్ డేట్స్ ని కూడా తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ మధ్య అమ్మడు ఫారెన్ టూర్స్ ఎక్కువగా చేస్తూ కనిపిస్తోంది. ఈవెంట్స్, షోస్ కోసం అక్కడికి వెళ్లడం అక్కడ ఫొటోస్, వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు తన న్యూ అప్ డేట్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసింది. "నా బిగ్గెస్ట్ ఫేవరేట్ సిటీ ఐన డల్లాస్ లో త్వరలో బ్యాండ్ ఎలీజియం అనే ఒక పెద్ద కన్సర్ట్ ని హోస్ట్ చేయబోతున్నాను.

ఎక్కడ అంటే 6300 ఫ్లయర్స్ వే, ఫ్రిస్కోకి వస్తున్నాను జూన్ 3 న మిమ్మల్నందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నాం.. రెడీ ఉండండి" అంటూ ఒక అనౌన్స్మెంట్ ని కూడా ఇచ్చేసింది. టికెట్స్ కూడా రెడీగా ఉన్నాయి. వెంటనే తీసుకోండి అంటూ తన ఫాన్స్ తో ఈ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకుంది. అష్షు ఎప్పుడూ పొట్టి డ్రెస్సుల్లోనే కాదు అప్పుడప్పుడు మంచి హోమ్లీ లుక్ లో కూడా కనిపిస్తుంది. రీసెంట్ గా డల్లాస్ లో ఉంటున్న ఫ్రెండ్ దివ్య హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కి  చీరకట్టులో కనిపించి  సందడి  చేసింది.