Read more!

English | Telugu

ముకుందకి మిగిలిన నిరాశ.. తల్లి ప్రేమకై మురారి కలవరింత!

స్టార్ మా టీవీలో ప్రసరమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -154లో... మురారి ఒక్కసారిగా నిద్ర నుండి లేచి కూర్చుంటాడు. అప్పుడే కేక్ కటింగ్ కి అన్ని సిద్ధం చేసి మురారి దగ్గరికి కృష్ణ వస్తుంది. అలా వచ్చిన కృష్ణ.. ఏసీపీ సర్.. మీరు ఫ్రెష్ అప్ అయి రండని చెప్తుంది. మరొకవైపు ముకుంద మేడపైన కేక్ డెకరేషన్ చేసి కేక్ కటింగ్ కి అన్ని సిద్ధం చేసింది.

మురారి తన దగ్గరికి వచ్చి కేక్ కట్ చేసినట్లుగా, తన వేలుకి రింగ్ ని తొడిగినట్లుగా ముకుంద ఊహించుకుంటుంది. ఇంతలో ముకుందకి మురారి మెసేజ్ చేస్తాడు. సారీ నేను ఇప్పుడు రాలేను.. నన్ను అర్థం చేసుకోమని మెసేజ్ చెయ్యగానే.. ముకుంద బాధపడుతు.. అన్నీ నేనే అర్థం చేసుకోవాలి.. మీ ఇంట్లో వాళ్ల కోసం.. నా ప్రేమని త్యాగం చేశానంటూ అనుకొని మురారి గది దగ్గరికి ముకుంద వస్తుంది. అప్పుడే కేక్ కట్ చేసి కృష్ణకి తినిపిస్తాడు మురారి. అది చూసిన ముకుంద ఏడుస్తూ.. తన గదిలోకి వెళ్ళిపోతుంది. మురారితో కృష్ణ నవ్వుతు సరదాగా ఉంటుంది.

ముకుంద తన గదిలో ఏడుస్తుంటుంది. నువ్వు చాలా మారిపోయావు మురారి అని ముకుంద అనుకుంటుంది.. మరొకవైపు భవాని  ఒక్కతే తన గదిలో ఉండి.. మురారికి విషెస్ చెప్పాలని ఆలోచిస్తుంది. మురారిపై ఉన్న ప్రేమతో మురారి గది దగ్గరికి వచ్చి.. మురారిని చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు మురారి పడుకొని ఉంటాడు. కాసేపటికి మురారి నిద్రలో.. పెద్దమ్మ నాతో మాట్లాడావా? నన్ను క్షేమించవా అంటూ కలవరిస్తాడు. మురారి దగ్గర కృష్ణ ఉండడం చూసి లోపలికి రాకుండా బయటే ఉంటుంది భవాని.  హ్యాపీ బర్త్ డే మురారి అని మనసులో అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది భవాని. మరోవైపు మురారికి ఏదో సర్ ప్రైజ్ గిఫ్ట్ ని రెడీ చేసే ప్లాన్ లో కృష్ణ ఉంటుంది.

మరుసటి రోజు ఉదయం ముకుంద తన గదిలో కూర్చొని బాధపడుతుంది. రాత్రి కృష్ణతో మురారి అలా బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోవడం పదే పదే గుర్తుచేసుకుంటూ ఏడుస్తుంది. హృదయాన్ని కాల్చడనికి ప్రేమించిన వాడి చిన్న నిర్లక్ష్యం చాలు.. ఎందుకు మురారి నేను దగ్గరగా రావాలనుకుంటే నువ్వు దూరంగా వెళ్తున్నావ్.. నువ్వు దూరంగా వెళ్లినా.. నేను దూరం కాలేను. ఎందుకంటే నిన్ను చూడగానే ప్రేమ పుట్టలేదు, నువ్వు వదిలెయ్యగానే మర్చిపోవడానికి, నీలో వచ్చిన మార్పు నేను ఆక్సెప్ట్ చేయలేను. రోజు రోజుకు నాలో నిరాశ నిస్పృహలు ఎక్కువ అవుతున్నాయి.. ఎలాగైనా నా ప్రేమని దక్కించుకుంటాను. ఈ రింగ్ ని ఎలాగైనా మురారికి తొడగాలని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.