English | Telugu

కొత్త వెబ్ సిరీస్ "స్టూడెంట్" స్టార్ట్....శివగా షణ్ముఖ్

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ బుల్లితెర మీద, సోషల్ మీడియాలో మంచి ఫేమ్ తెచ్చుకున్న నటుడు.  షన్ను ఎలాంటి వెబ్ సిరీస్ చేసినా అది యూత్ కు బాగా  కనెక్ట్ ఐపోతుంది. అలాంటి షన్ను ఆహా సంస్థతో కలిసి ఏఏఎస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ గా అందరినీ మెప్పించి ఓటిటి ప్రపంచంలో కూడా తనదైన ముద్ర వేసేసుకున్నాడు. అలాంటి షన్ను లేటెస్ట్ గా కొత్త ప్రాజెక్ట్ తో రాబోతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. "స్టూడెంట్" అనే కొత్త వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేసినట్లు దాని షూటింగ్ కూడా స్టార్ట్ ఐనట్లు వెల్లడించాడు. ఇందులో రాఘవ, శివ, చక్రి అనే ముగ్గురు స్టూడెంట్స్ ఉంటారు. షన్ను ఇందులో శివ అనే స్టూడెంట్ గా నటిస్తున్నాడు.

చిరు నుంచి ప్రశంసలు అందుకున్న అయ్యన్ ప్రణతి

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో 14 ఏళ్ళ అయ్యన్ ప్రణతి తన పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. ఈ చిన్నారికి రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. అలాంటి ప్రణతి ఈ వారం చిత్ర గారి పాట" నిన్ను కోరి వర్ణం" పాడింది. కానీ ఆ సాంగ్ లో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ని జడ్జెస్ అంతా చెప్పారు. ఏజ్ తక్కువే కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలనీ...ఇంకా చక్కగా నేర్చుకోవాలని టిప్స్ ఇచ్చారు. అయ్యన్ ప్రణతి టాలెంట్ ఎలాంటిది అంటే గత ఎపిసోడ్స్ లో సర్ మూవీ నుంచి "మాస్టారు..మాస్టారు" సాంగ్ పాడి అందరినీ ఫిదా చేయడమే కాదు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ ని కూడా పడేసింది. ఆయన ఆ చిన్నారికి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసారు. ఇక ఇప్పుడు చిరంజీవి వంతు వచ్చింది.

షకలక శంకర్ రీ-ఎంట్రీ..టీంలీడర్ గా ఎంట్రీ ఇచ్చిన పటాస్ ప్రవీణ్

ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రతీ వారం ఎంటర్టైన్ చేస్తోంది. కానీ ఈ వారం ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉందంటూ పెద్ద డైలాగ్ చెప్పింది రష్మీ. ఆ మాట నిజమే అనిపిస్తోంది ఈ వారం ప్రోమో చూస్తే.  ప్రతీ వారం ఈ షోకి జడ్జిగా ఉన్న ఖుష్బూ ఈ వారం కనిపించలేదు. ఆమె ప్లేస్ లో సదా స్టైల్ గా వచ్చి కూర్చుంది. ఇకపోతే ఇందులో టీం లీడర్స్ కూడా మారినట్టు కనిపిస్తోంది. పటాస్ ప్రవీణ్ వస్తూనే "ఇన్నాళ్లు డైలాగులా కోసం, ప్రోమోల కోసం ఏడ్చామ్...మారాయ్..టీములు మారాయి...టీమ్ లీడర్ లు మారారు... టీం లీడర్ ప్రవీణ్ వచ్చాడని చెప్పండి" అంటూ తాను టీం లీడర్ ఐనట్టు ఆడియన్స్ కి మెసేజ్ ఇచ్చేసాడు. రీసెంట్ గానే ఇమ్మానుయేల్ కూడా టీం లీడర్ అయ్యాడు.

కొండచిలువతో కబుర్లు చెప్తున్న రిషి సర్!

ముఖేష్ గౌడ కంటే రిషి సర్ అంటేనే ఆయన ఆటిట్యూడ్ కి సరిగ్గా సూటవుతుందేమో. "గుప్పెడంత మనసు" సీరియల్ లో రిషి క్యారెక్టర్ మంచి హుషారుగా ఉంటుంది. వసుధారతో చేసే  సైలెంట్ రొమాన్స్ మాములుగా ఉండదు. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఫాన్స్ ఉన్నారు అని అడిగితే రిషి సర్ కే అని చెప్పొచ్చు. అలాంటి రిషికి ప్రకృతి అన్నా అందులో జీవించే జంతువులన్నా చాలా ఇష్టం. ఇదే కాదు మంచి దైవ భక్తుడు కూడా. దేవాలయాలకు వెళ్తాడు అలాగే జూకి, పార్క్స్ కి వెళ్లి మస్త్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ ఫొటోస్ ని వీడియోస్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు కూడా ఒక జూకి వెళ్ళాడు.