Read more!

English | Telugu

సెమీఫైనల్స్ కి వెళ్లిన సౌజన్య.. చిత్ర గారి 2.0 ని చూస్తున్నాను అన్న థమన్

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఈ వారం ఎపిసోడ్ మంచి పోటాపోటీగా జరిగింది. చిత్రమ్మ ఈ ఎపిసోడ్ కి జడ్జిగా వచ్చినందుకు కంటెస్టెంట్స్ అంతా కూడా ఆమె పాడిన మూవీస్ నుంచి హిట్ సాంగ్స్ పాడారు...అలాగే "కస్టడీ" మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా కృతిసెట్టి వచ్చి కాసేపు ఫన్ చేసి వెళ్ళిపోయాక "మ్యూజిక్ స్కూల్" మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా శ్రియశరన్ వచ్చింది. 

ఈ ఎపిసోడ్ లో  లాస్య ప్రియాతో కలిసి చిత్ర ఒక సాంగ్ కూడా పాడారు. తర్వాత సౌజన్య భాగవతుల వచ్చి "ఏ శ్వాసలో చేరితే" అనే సాంగ్ పెర్ఫార్మ్ చేయగా జడ్జెస్ అంతా ఫిదా ఇపోయారు. ఇక చిత్రమ్మ ఆమె పాటకు స్టాండింగ్ ఒవేషన్ కూడా ఇచ్చారు. అలాగే సౌజన్య కూతురి కోసం చిత్ర గాజుల్ని ప్రెజెంట్ చేశారు. "మీ అమ్మాయికి మాత్రమే గిఫ్ట్ ఇవ్వడం లేదు నీకు కూడా గిఫ్ట్ ఉంది. యూ ఆర్ సెలెక్టెడ్ టు ది సెమీఫైనల్స్" అని చెప్పేసారు. సౌజన్య పాడిన పాట "నేనున్నాను" మూవీలోది. ఆ మూవీలో ఈ సాంగ్ లో శ్రియశరన్ నటించారు. అప్పుడు చిత్రమ్మ "శ్రియ గారు అసలు ఈ సాంగ్ కి లిప్ మూమెంట్ అంత కరెక్ట్ గా ఎలా ఇచ్చారు అని అడిగేసరికి నిజం చెప్పాలంటే చాలా కష్టం మేడం..కానీ ఈ సాంగ్ ని ఒక లెజెండ్ పాడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా నేర్చుకోవాలి ఆ స్వరాలన్నీ అని మా డైరెక్టర్ నన్ను సంగీతం క్లాసెస్ కి పంపించారు. ఈ సాంగ్ కోసం నేను చాలా నేర్చుకున్నాను. దాని వల్లనే నేను లిప్ మూమెంట్ ని కరెక్ట్ గా ఇవ్వగలిగాను..ఒక బ్యూటిఫుల్ సింగర్ సాంగ్ పాడుతున్నారంటే దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద చాలా ఎక్కువగా ఉంటుంది కదా" అని చెప్పింది. "ఓహ్ అది మీ డెడికేషన్..ఆ సాంగ్ లో మీరు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు " అని శ్రియశరన్ కి కితాబిచ్చారు చిత్ర. 

"సౌజన్య..టాప్ 3 లో కలుద్దాం" అని చెప్పింది గీతమాధురి. "ఈ వారం ఎపిసోడ్ లో చిత్ర గారు కళ్ళజోడు పెట్టుకున్నారు గులాబీ రేకుల్ని అరచేతిలో వేసుకుని ఊదారు...స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. నేను చిత్ర గారి  2 . 0 ని చూస్తున్నా" అన్నారు ఫన్నీగా థమన్. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ నుంచి చక్రపాణి ఎలిమినేట్ ఐపోయాడు.