రణబీర్ ప్రపోజ్ చేసినప్పటి ఫొటోను రివీల్ చేసిన ఆలియా!
ఆలియా భట్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కొత్త ప్రొఫైల్ పిక్చర్‌గా తన “ఇష్టమైన చిత్రం”ను ఎంచుకుంది. అది ఆలియాకు రణబీర్ కపూర్ ప్రపోజ్ చేసిన సమయంలో తీసిన రొమాంటిక్ చిత్రం. రణబీర్ కపూర్, ఆలియా భట్ తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నారు. ఆమె సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తను అభిమానులతో పంచుకుంది. ఈ వార్త ఇంటర్నెట్లో పత్యక్షమవడం ఆలస్యం, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహనటులు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.