Read more!

English | Telugu

షారుక్ 'జ‌వాన్' ఓటీటీ హ‌క్కుల‌కు నెట్‌ఫ్లిక్స్ ఎంత చెల్లించిందో తెలుసా?

 

షారుక్ ఖాన్ 'జ‌వాన్' మూవీతో ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు రెడీ అవుతున్నాడు. 'జ‌వాన్‌'లో షారుక్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ అట్లీ షేర్ చేసిన‌ప్ప‌ట్నుంచీ ఫ్యాన్స్ హ‌డావిడి మామూలుగా లేదు. రోజురోజుకూ వారి క్యూరియాసిటీ లెవ‌ల్స్ పెరిగిపోతూ, ఆ సినిమా నుంచి మ‌రిన్ని అప్‌డేట్స్ కావాల‌ని డిమాండ్ చేస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్ర‌కారం 'జ‌వాన్' ఓటీటీ హ‌క్కుల్ని నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి చేజిక్కించుకుంది.

థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు లేదా నాలుగు వారాల త‌ర్వాత ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. దీని కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 120 కోట్ల‌కు ఒప్పందం చేసుకుంద‌ని వినిపిస్తోంది. ఇటీవ‌ల త‌న ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఫీడ్ ద్వారా ఫ్యాన్స్‌తో సంభాషించిన బాలీవుడ్ బాద్‌షా, త‌న అప్‌క‌మింగ్ ఫిల్మ్ 'జ‌వాన్' గురించి కూడా మాట్లాడాడు. ఆ సినిమాకి సంబంధించి ఎక్కువ ఇన్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌క‌పోయినా, అదొక భిన్న‌మైన సినిమాగా ఆయ‌న తెలిపాడు.

షారుక్ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్న 'జ‌వాన్' మూవీలో న‌య‌న‌తార‌, దీపికా ప‌డుకోనే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 2023 జూన్ 2న ఈ చిత్రం హిందీ, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ది. ఈ సినిమా కంటే ముందుగా 2023 జ‌న‌వ‌రి 25న‌ 'ప‌ఠాన్' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు షారుక్‌.