English | Telugu

ఇండియ‌న్ డిన్న‌ర్‌కు రూ. 49 ల‌క్ష‌ల టిప్ ఇచ్చిన జానీ డెప్‌!

హాలీవుడ్ యాక్ట‌ర్లు, మాజీ భార్యాభ‌ర్త‌లు జానీ డెప్‌, అంబ‌ర్ హార్డ్ మ‌ధ్య‌ ప‌రువు న‌ష్టం కేసు ఇటీవ‌లే ముగిసింది. ఆరు వారాల పాటు సాగిన విచార‌ణ అనంత‌రం ఈ కేసులో 50 మిలియ‌న్ డాల‌ర్ల‌ను గెలుచుకున్నాడు డెప్‌. ఆ త‌ర్వాత ఇంగ్లాండ్‌లో గిటారిస్ట్ జెఫ్ బెక్‌తో క‌లిసి మ్యూజిక‌ల్ టూర్‌లో పాల్గొంటున్న అత‌ను ప‌లుమార్లు ప‌బ్లిక్ క‌ళ్ల‌లో ప‌డుతూ వ‌స్తున్నాడు. రీసెంట్‌గా బ‌ర్మింగ్‌హామ్‌లో ఓ ఇండియ‌న్ రెస్టారెంట్‌కు వెళ్లిన డెప్‌, డిన్న‌ర్ త‌ర్వాత హోట‌ల్ సిబ్బందిని ఆశ్చ‌ర్య‌పరుస్తూ పెద్ద మొత్తాన్ని టిప్‌గా ఇచ్చాడు.