అమ్మ స్మితా పాటిల్ పేరును గుండెపై రాయించుకున్న ప్రతీక్!
అమ్మ, లెజెండరీ యాక్ట్రెస్ స్మితా పాటిల్ లేని లోటు బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్కు ఎన్నటికీ తీరనిది. అమ్మను తలుచుకోని క్షణం ఉండదు అతడికి. రీసెంట్గా అమ్మ పేరును తన గుండెపై రాయించుకున్నాడు ప్రతీక్. అట్లా అమ్మను శాశ్వతంగా చెరిగిపోని గుర్తుగా చేసుకున్నాడు. నటుడు, రాజకీయవేత్త రాజ్ బబ్బర్, దివంగత నటి స్మితా పాటిల్ దంపతులకు పుట్టాడు ప్రతీక్.