Read more!

English | Telugu

'కేజీఎఫ్'ని షారుఖ్ తో తీస్తే ఎవరూ చూడరు!

కన్నడ నుంచి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన 'కేజీఎఫ్' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. 'కేజీఎఫ్-2'కి నార్త్ ప్రేక్షకుల నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హిందీలో ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా నెట్ రాబట్టి సత్తా చాటింది. అయితే ఇదే సినిమాని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో తీసుంటే హిందీ ప్రేక్షకులు ఆదరించేవారు కాదంటూ బాలీవుడ్ రచయిత రాజ్ సలువా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

హిందీ ప్రేక్షకులు ప్రస్తుతం సౌత్ మాయలో ఉన్నారని.. సౌత్ హీరోలు ఏం చేసినా అబ్బో అంటున్నారని, అదే హిందీ హీరోలు చేస్తే మాత్రం అబ్బే అంటూ పక్కన పెట్టేస్తున్నారని రాజ్ సలువా ఫీల్ అవుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. "హిందీ సినిమాలు ప్లాప్ కావడానికి కథలు కారణం కాదు. ఆడియెన్స్ టేస్ట్ మారింది. సౌత్ సినిమాలను ఆదరిస్తున్నారు. వాళ్ళేం సినిమాలు చూడాలనేది వాళ్ళిష్టం. కానీ ఒకవేళ 'కేజీఎఫ్' సినిమాని షారుఖ్ తో చేసుంటే మాత్రం ఖఛ్చితంగా ఆదరించేవారు కాదు.  అంతెందుకు జాన్ అబ్రహం 'సత్యమేవ జయతే', 'ఎటాక్' వంటి యాక్షన్ సినిమాలు చేస్తే ఆదరించలేదు. అదే ఎన్టీఆర్, రామ్ చరణ్, యశ్ చేస్తే మాత్రం ఎగబడి చేస్తారు" అంటూ రాజ్ సలువా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

కాగా, రాజ్ సలువా రచయితగా పనిచేసిన 'రాష్ట్ర కవచ ఓం' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే రాజ్ సలువా ఈ వ్యాఖ్యలు చేశాడు.