Read more!

English | Telugu

స‌మంత బాలీవుడ్ ఎంట్రీ ఈ హీరోతోనే!

 

'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న తర్వాత, నటి సమంతా రూత్ ప్రభు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. 'ఊ అంటావా' పాటలో తన అద్భుతమైన ఎక్స్‌ప్రెష‌న్స్‌, మూవ్‌మెంట్స్‌తో ఇంటర్నెట్‌ను తుఫానులా ఊపేసిన‌ సమంత, బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి న‌టించేందుకు తన తొలి చిత్రానికి సంతకం చేసినట్లు సమాచారం. లేటెస్ట్ రిపోర్టుల ప్ర‌కారం ఈ చిత్రాన్ని దినేశ్ విజ‌న్ నిర్మించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యింద‌నీ, షూటింగ్ షెడ్యూల్స్‌ను ప్లాన్ చేస్తున్నార‌నీ తెలిసింది.

రిపోర్టుల‌ ప్రకారం, మేకర్స్ ప్రస్తుతం ప్రతిదీ ప్లాన్ చేసి ఉంచారు. ఈ మూవీ ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లవచ్చు. 2023 చివరలో విడుదల అవుతుంది. సమంత తన రెండో హిందీ చిత్రానికి కూడా సంతకం చేసిందని బాలీవుడ్ వ‌ర్గాలు తెలిపాయి. 2023లో షూటింగ్ మొద‌ల‌య్యే ఈ సినిమా ఓ పౌరాణికం. క‌ర‌ణ్ జోహార్ నిర్మించే మ‌రో సినిమాని కూడా ఆమె అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు. ఇందులో అక్ష‌య్ కుమార్ హీరో. ఆ ఇద్ద‌రూ కాఫీ విత్ క‌ర‌ణ్ ప్రోగ్రామ్‌లో క‌నిపించ‌నున్నారు. 

మ‌రోవైపు తెలుగులో గుణ‌శేఖ‌ర్ డైరెక్ష‌న్‌లో 'శాకుంత‌లం'తో పాటు శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తోన్న 'య‌శోద' చిత్రాల‌ను స‌మంత పూర్తి చేసింది.