Read more!

English | Telugu

తల్లి కాబోతున్న ఆలియా భట్

బాలీవుడ్ ప్రేమ జంట రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆలియా భట్ అభిమానులతో ఓ శుభవార్తను పంచుకుంది. తాను తల్లి కాబోతున్నట్లు తెలిపింది.

హాస్పిటల్ లో స్కాన్ చేయించుకుంటున్న ఫోటోను ఆలియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమె బెడ్ పక్కన రణ్ బీర్ కూడా కూర్చొని ఉన్నాడు. ఆ ఫోటోకి 'మా బేబీ త్వరలో వస్తోంది' అనే క్యాప్షన్ ని జోడించింది. దీంతో ఆలియా-రణ్ బీర్ జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

సినిమాల విషయానికొస్తే రణ్ బీర్ తో కలిసి ఆలియా నటించిన 'బ్రహ్మాస్త్ర పార్ట్-1' సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 'హార్ట్ ఆఫ్ స్టోన్'తో హాలీవుడ్ లోకి అడుగు పెట్టనుంది. పెళ్లి టైంలోనే కొన్ని సినిమా ఆఫర్లను సున్నితంగా తిరస్కరించిన ఆమె.. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన నేపథ్యంలో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చే అవకాశముంది.