Read more!

English | Telugu

'జ‌వాన్'కి విల‌న్ గా విజ‌య్!?

`మాస్ట‌ర్`, `ఉప్పెన‌`, `విక్ర‌మ్` చిత్రాల్లో ప్ర‌తినాయ‌కుడిగా మెప్పించారు మక్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో ఈ టాలెంటెడ్ స్టార్ ఓ హిందీ సినిమాలో విల‌న్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నార‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ టైటిల్ రోల్ లో `జ‌వాన్` పేరుతో త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ ఓ యాక్ష‌న్ ఎంట‌ర్టైనర్ ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో షారూక్ తండ్రీత‌న‌యులుగా ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఒక పాత్ర‌కి జోడీగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క‌నిపించ‌నుండ‌గా.. ఫ్లాష్ బ్యాక్ లో వ‌చ్చే తండ్రి వేషానికి జంట‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకోణ్ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ట‌.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో బ్యాడీగా విజ‌య్ సేతుప‌తిని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. అంతేకాదు.. ఎంతో శ‌క్తిమంతంగా ఈ పాత్ర ఉంటుంద‌ని చెప్పుకుంటున్నారు. త్వ‌ర‌లోనే `జ‌వాన్`లో విజ‌య్ సేతుప‌తి రోల్ పై క్లారిటీ రానుంది. మ‌రి.. షారూక్ ని ఢీ కొట్ట‌నున్న విజ‌య్ సేతుప‌తి.. హిందీ ప్రేక్ష‌కుల‌ను ఏ స్థాయిలో ఆక‌ట్టుకుంటారో చూడాలి. కాగా,  వ‌చ్చే ఏడాది జూన్ 2న `జ‌వాన్` జ‌నం ముందుకు రానుంది.