Read more!

English | Telugu

'గాడ్‌ఫాద‌ర్' యాక్ట‌ర్ క‌న్నుమూత‌

 

హాలీవుడ్ పాపుల‌ర్ యాక్ట‌ర్‌, 'ద గాడ్‌ఫాద‌ర్‌'లో స‌న్నీ కొర్లియోన్ క్యారెక్ట‌ర్‌తో ఫేమ‌స్ అయిన జేమ్స్ కాన్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 82 సంవ‌త్స‌రాలు. 'మిజ‌రీ', 'థీఫ్‌', 'రోల‌ర్‌బాల్' సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు స‌న్నిహితులైన జేమ్స్ కాన్‌, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా డైరెక్ట్ చేసిన 1972 నాటి క్లాసిక్ 'ద గాడ్‌ఫాద‌ర్‌'లో మాఫియా ఫ్యామిలీలోని పెద్ద కొడుకుగా చేసిన విషాదాంత పాత్ర‌కు గాను ఆస్కార్ నామినేష‌న్ కూడా పొందారు. 

హాలీవుడ్‌లో 1960ల‌లో న‌టునిగా కెరీర్ ప్రారంభించిన ఆయ‌న మొద‌ట్లో బిల్లీ వైల్డ‌ర్‌, హోవార్డ్ హాక్స్‌, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా లాంటి డైరెక్ట‌ర్ల సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేశారు. 'ద గాడ్‌ఫాద‌'ర్ మూవీలోని అతి కీల‌క స‌న్నివేశాల్లో ఒక‌టైన‌ ఒక టోల్ బూత్‌లో బుల్లెట్ల వ‌ర్షంలో త‌డిసి ముద్ద‌య్యే స‌న్నీ కొర్లియోన్ పాత్ర ఆయ‌న కెరీర్ దిశ‌ను మార్చేసింది. 'ద గాడ్‌ఫాద‌ర్ పార్ట్ 2'లో ఆయ‌న అతిథి పాత్ర‌లో క‌నిపించారు.

ఆ త‌ర్వాత నార్మ‌న్ జెవిన్స‌న్ రూపొందించిన 'రోలర్‌బాల్‌'లో వ‌యొలెంట్‌గా ప్ర‌వ‌ర్తించే అథ్లెట్‌గా, మైఖేల్ మ‌న్ డైరెక్ట్ చేసిన 'థీఫ్‌'లో ఆభ‌ర‌ణాల దొంగ‌గా, రాబ్ రైన‌ర్ సినిమా 'మిజ‌రీ'లో కిడ్నాప్‌కు గురయ్యే ర‌చ‌యిత‌గా అద్భుత‌మైన అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు జేమ్స్ కాన్‌.