Read more!

English | Telugu

'బ్రహ్మాస్త్ర' కంటే ముందే 'షంషేరా'తో వస్తున్న ర‌ణ్‌బీర్

సౌత్ హీరోలు నార్త్ లోనూ సత్తా చాటుతూ పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ హీరోల దృష్టి సౌత్ మార్కెట్ పై పడింది. ముఖ్యంగా బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ కపూర్ సౌత్ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. సెప్టెంబర్ 9న 'బ్రహ్మాస్త్ర'తో పాన్ ఇండియా స్థాయిలో అలరించడానికి  సిద్ధమవుతున్న ర‌ణ్‌బీర్ అంతకన్నా ముందే 'షంషేరా'తో హిందీతో పాటు సౌత్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

రణ్‌బీర్‌ నటించిన లేటెస్ట్ మూవీ 'షంషేరా'. కరణ్ మల్హోత్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వాణి కపూర్, సంజయ్ దత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై 22న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ర‌ణ్‌బీర్ లుక్ విభిన్నంగా ఉంది. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో చేతిలో పెద్ద గొడ్డలి పట్టుకొని ఉన్న  ర‌ణ్‌బీర్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో 1800 కాలం నాటి స్వాతంత్ర్య కాంక్ష కలిగిన దోపిడి ముఠా నాయకుడిగా కనిపించనున్నట్లు ర‌ణ్‌బీర్ తెలుస్తోంది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

2018 లో వచ్చిన 'సంజు' సినిమాతో మెప్పించిన రణ్‌బీర్‌.. నాలుగేళ్ళ తర్వాత థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. తక్కువ వ్యవధిలోనే రెండు సినిమాలు 'షంషేరా', 'బ్రహ్మస్త్ర'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రణ్‌బీర్‌.. హిందీలో విజయాన్ని అందుకోవడమే కాకుండా సౌత్ లోనూ మార్కెట్ ని పెంచుకుంటాడేమో చూడాలి.