English | Telugu

చైల్డ్ ఆర్టిస్ట్‌గానే సూప‌ర్బ్‌ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఫ‌స్ట్ టాలీవుడ్ స్టార్‌ మ‌హేశ్‌!

1975 ఆగ‌స్ట్ 9న ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ‌, ఇందిరాదేవి దంప‌తుల‌కు చెన్నైలో జ‌న్మించాడు మ‌హేశ్‌. ఆ టైమ్‌లో కృష్ణ 'గాజుల కిష్ట‌య్య' సినిమా చేస్తున్నారు. పిల్ల‌ల‌కు సెల‌వులు వ‌స్తే వాళ్ల‌ను షూటింగ్ లొకేష‌న్ల‌కూ, సెట్ల ద‌గ్గ‌ర‌కూ తీసుకెళ్లేవారు కృష్ణ‌. దాంతో స‌హ‌జంగానే మ‌హేశ్‌కు సినిమారంగంపై ఆస‌క్తి ఏర్ప‌డింది. అన్న ర‌మేశ్‌బాబు ప్ర‌ధాన‌పాత్ర పోషించ‌గా, దర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు రూపొందించిన 'నీడ' చిత్రంలో మ‌హేశ్ ఓ చిన్న పాత్ర పోషించ‌డం ద్వారా తెరంగేట్రం చేశాడు.