Read more!

English | Telugu

"మీ కోసం ముంబై వ‌స్తా" అన్న‌ వైజాగ్ అమ్మాయి.. సోను సూద్ రిప్లై ఇది!!

 

సోను సూద్ గురించి ఇవాళ తెలియ‌నివాళ్లెవ‌రు! తెర‌పై విల‌న్‌గా ఎన్నో చెడ్డ‌ప‌నులు చేసే ఆయ‌న‌, తెర‌బ‌య‌ట నిజ జీవితంలో ఎన్నో మంచిప‌నులు చేస్తూ రియ‌ల్ హీరోగా ఎంతో కీర్తి సంపాదించుకున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని అత‌లాకుత‌లం చేసిన సంద‌ర్భంగా ఆయ‌న గొప్ప‌త‌నం ఏమిట‌నేది ప్ర‌పంచానికి తెలిసింది. ఒక వ్య‌క్తి వ్య‌వ‌స్థ‌గా మారి, వంద‌లు కాదు వేల‌మందికి సాయం చేయ‌డం అనేది ఏ ర‌కంగా చూసినా అసాధార‌ణ‌మే కాదు, చాలా చాలా గొప్ప విష‌యం.

స్వ‌త‌హాగా సోను చాలా బిడియ‌స్తుడు. 'సీషా' అనే హిందీ సినిమాలో నేహా ధూపియాతో క‌లిసి న‌టించారు. అందులో నేహ‌తో ఆయ‌న‌కు ఓ ముద్దు సీన్ ఉంది. మామూలుగానే ఆయ‌న‌కు సిగ్గెక్కువ‌. అదీ కిస్ సీన్‌లో చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల‌య్యారు. ఈ సీన్‌ను ఎలాగైనా మార్పించాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ డైరెక్ట‌ర్ క‌న్విన్స్ కాలేదు. చివ‌ర‌కు ఆ సీన్‌ను ఇబ్బంది ప‌డుతూనే చేశారు.

చాలా కాలం క్రితం విశాఖ‌ప‌ట్నంలో సోను ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న‌ప్పుడు ఒక అమ్మాయి ఆటోగ్రాఫ్ అడిగింది. ఆయ‌న ఇచ్చారు. ఆ త‌ర్వాత నుంచీ ఆయ‌న‌కు ఆ అమ్మాయి ఫోన్లు చేస్తుండేది. త‌న‌ ఫోన్ నంబ‌ర్ ఆమె ఎలా సంపాదించిందో సోనుకు కూడా తెలీదు. "గుడ్ మార్నింగ్" అంటూ మెసేజ్‌లు మొద‌లుపెట్టి ఆయ‌న సినిమా గురించి ఎక్కువ‌గా మాట్లాడుతుండేది. ఓసారి కాస్ట్‌లీ గిఫ్ట్ కూడా పంపింది. 

అప్పుడు సోనుకు కోపం వ‌చ్చింది. "నువ్వు బుద్ధిగా చ‌దువుకో. ఇంతింత ఖ‌ర్చుచేసి నాకు గిఫ్టులు కొనేకంటే మంచి పుస్త‌కాలు కొనుక్కో" అని చెప్పారు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు "మీ కోసం ముంబై వ‌స్తున్నా" అని చెప్పింది. "ఆ ప‌ని చేశావంటే పోలీసుల‌కు కంప్లైంట్ ఇస్తా" అన్నారు సోను. దాంతో ఆ అమ్మాయి ఫోన్లు చేయ‌డం మానేసింది.