బరిలో ఎవరున్నా సరే.. సంక్రాంతికే సై.. ఏంటీ కాన్ఫిడెన్స్!
వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ రసవత్తరంగా ఉండనుంది. ఇప్పటికే 2024 సంక్రాంతి సీజన్ పై 'గుంటూరు కారం', 'ఈగల్', 'నా సామి రంగ', 'VD 13' వంటి సినిమాలు కర్చీఫ్ వేశాయి. అలాగే సైంధవ్ కూడా సంక్రాంతికే వచ్చే అవకాశముంది అంటున్నారు. అయితే ఈ భారీ పోటీ నడుమ.. ఎప్పుడో పండగ సీజన్ పై కన్నేసిన 'హనుమాన్' సినిమా పరిస్థితి ఏంటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 'హనుమాన్' టీమ్ మాత్రం బరిలో ఎవరున్నా తగ్గేదేలే అంటోంది.