English | Telugu
ప్రపంచానికి కావలసింది నీలాంటి మగాడే : అనసూయ
Updated : Oct 4, 2023
బుల్లితెరపై, వెండితెరపై రాణిస్తూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న అనసూయ ఇప్పుడు సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, కొన్ని విషయాలపై స్పందించే అనసూయకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే తనకు సంబంధించిన ఏ విషయాన్నయినా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అంతేకాదు, తన వివాదాస్పద వ్యాఖ్యలతో కొన్నిసార్లు ఇరుకున పడిన సందర్భాలు కూడా లేకపోలేదు.
లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్ట్‌తో అభిమానుల్ని పలకరించింది అనసూయ. తన భర్త పుట్టినరోజు సందర్భంగా అనసూయ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేసింది. అదేమిటంటే.. ‘నీలాంటి భర్త, నీలాంటి తండ్రి, నీలాంటి కొడుకు, నీలాంటి అల్లుడు, నీలాంటి అన్న... మొత్తానికి నీలాంటి మగాడు ఈ ప్రపంచానికి కావాలి’ అంటూ అనసూయ వేసిన ట్వీట్‌తో తన భర్తపై ఆమెకు ఎంత ప్రేమ వుందో వ్యక్తమవుతోందని నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.