English | Telugu
అందుకే డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం ఉందంటున్నారు
Updated : Oct 4, 2023
ఇటీవల డ్రగ్స్ కేసుకు సంబంధించి హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్ పేరు వినిపించిన విషయం తెలిసిందే. ఆమెకు సమన్లు ఇచ్చారని, త్వరలోనే ఆమెను ఈ కేసు విషయంలో ఎంక్వరీ చేస్తామని పోలీసులు తెలిపినట్టు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వరలక్ష్మీ పేరు రాగానే దీనిపై వెంటనే ఆమె స్పందించింది. తనకు ఎలాంటి సమన్లు అందలేదని, అసలు ఈ కేసుతో తనకు సంబంధం లేదని ఆమె చెప్పింది.
ఈ విషయాన్ని మరోసారి ఖండిస్తూ.. తన పేరు ఈ కేసులో వినిపించచడానికి గల కారణాలను తెలియజేస్తూ.. ‘నా దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్‌గా పనిచేసిన ఆదిలింగం ద్వారా తనకు మూడు సినిమాలు వచ్చాయి. వాటిని పూర్తి చేశాను. అక్కడితో అతని పని అయిపోయింది. పర్సనల్ లైఫ్‌లో అతను ఏం చేస్తుంటాడో నాకెలా తెలుస్తుంది.
2020లో కేరళలో విల్లించాం తీర ప్రాంతంలో పోలీసులు సోదాలు చేయగా.. ఒక పడవలో డ్రగ్స్, రైఫిళ్లు, బుల్లెట్స్ లభించాయి. అప్పుడు 13మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 14వ నిందితుడిగా ఆదిలింగంను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అతను నా దగ్గర మేనేజర్‌గా పనిచేశాడు కాబట్టి నాకు కూడా దీనితో ఉన్నాయని అనుమానించిన పోలీసులు నాకు సమన్లు ఇచ్చారని, త్వరలో ఎంక్వరీ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ కేసులో వరలక్ష్మీ మేనేజర్ అరెస్ట్ అనేసరికి నా పేరు బాగా వినిపించింది. ఆదిలింగం ఫోటో వేసి న్యూస్ రాస్తే ఎవ్వరూ చదవరు, నా మేనేజర్ అని రాస్తే అందరూ చదువుతారు. అలా నా పేరు ఇందులోకి వచ్చింది’ అన్నారు.