English | Telugu

మెగాస్టార్ లైనప్.. సుకుమార్, రావిపూడి, త్రివిక్రమ్!

మెగాస్టార్ చిరంజీవి తన లైనప్ తో ఈ జనరేషన్ స్టార్స్ కి కూడా చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న మెగాస్టార్.. ఆ తర్వాత వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆ మూడు ప్రాజెక్ట్ ల కోసం సక్సెస్ ఫుల్ దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి లను రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.

చిరంజీవి, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని బలంగా న్యూస్ వినిపిస్తోంది. డీవీవీ దానయ్య ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారని వినికిడి. ప్రస్తుతం 'గుంటూరు కారం'తో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఓ ప్రాజెక్ట్ కమిటై ఉన్నారు. అది పూర్తి అయ్యాక చిరు ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవుతారో లేక ముందే చిరు ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తారో చూడాలి.

అలాగే సుకుమార్ డైరెక్షన్ లో చిరంజీవి ఓ సినిమా చేయనున్నారట. ఈ కాంబినేషన్ ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సెట్ చేశారట. 'పుష్ప'తో పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించిన సుకుమార్.. ప్రస్తుతం 'పుష్ప-2'ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన రూ.1000 కోట్ల సినిమా దర్శకుడిగా మారడం ఖాయమనే అంచనాలున్నాయి. అలాంటిది ఆయన పుష్ప-2 తర్వాత మెగాస్టార్ తో చేతులు కలపనున్నారని అంటున్నారు.

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉంటుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఖరారైందని, దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. అనిల్ రావిపూడి త్వరలో 'భగవంత్ కేసరి'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆ తర్వాత ఆయన ఫోకస్ మెగా ప్రాజెక్ట్ పైకి షిఫ్ట్ కానుందట.

ఏది ముందు, ఏది వెనుక ఉంటుందో కానీ ఈ మూడు ప్రాజెక్ట్స్ ఉండటం ఖాయమని అంటున్నారు. కాగా ఈ ముగ్గురు దర్శకులతో మెగాస్టార్ మొదటిసారి పనిచేయనుండటం విశేషం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.