English | Telugu

నిన్న కృతి, నేడు శ్రీలీల.. మూన్నాళ్ళ ముచ్చటేనా!

సినీ రంగంలో ఎప్పుడు ఎవరి దశ తిరుగుతుందో, ఎప్పుడు ఎవరి క్రేజ్ ఒక్కసారిగా పడిపోతుందో చెప్పడం కష్టం. కొందరికి ఎంట్రీతోనే ఊహించని క్రేజ్ రావడం, అవకాశాలు చుట్టముట్టడం జరుగుతుంటాయి. ఇక తిరుగులేని స్టార్డం వీరి సొంతం అనుకుంటున్న సమయంలో వరుస పరాజయాలతో ఒక్కసారిగా క్రేజ్ పోతుంది. 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టికి అలాంటి పరిస్థితే ఎదురైంది. 'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కృతిని వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ఇక ఆమెకి తిరుగులేదు, ఫ్యూచర్ లో స్టార్ హీరోయిన్ గా ఏలుతుంది అనుకున్నారంతా. కానీ పాత్రల ఎంపికలో పొరపాట్లు, వరుస పరాజయాలతో ఆమె క్రేజ్, అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు శ్రీలీల పరిస్థితి కూడా అలాగే మారుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

'పెళ్లి సందడి'తో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ అందుకొని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె డ్యాన్స్ లకు అందరూ ఫిదా అయ్యారు. 'ధమాకా' తర్వాత ఆమెని వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా దాదాపు పది సినిమాలు అంగీకరించింది. ఆ సినిమాలు విడుదలై హిట్ అయితే, ఇక శ్రీలీల క్రేజ్ ఎన్నో రేట్లు పెరిగిపోతుందని, ఆమె స్టార్డం ఎక్కడికో వెళ్ళిపోతుందని భావించారంతా. అయితే తాజాగా విడుదలైన 'స్కంద'తో ఆమె నిరాశపరిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అవ్వడం దాదాపు ఖాయమైంది. రిజల్ట్ విషయం పక్కన పెడితే.. అసలు ఈ సినిమాలో శ్రీలీల పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఇప్పటిదాకా చేసిన సినిమాలతో ఆమె డ్యాన్సర్ గా పేరు తెచ్చుకుంది కానీ, నటిగా ప్రూవ్ చేసుకోలేకపోయింది. పేరుకి శ్రీలీల చేతిలో భగవంత్ కేసరి, గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పెద్ద సినిమాలు ఉన్నాయి కానీ.. స్కంద చూశాక ఆ సినిమాల్లో మాత్రం ఆమె పాత్రకి ఎంతవరకు స్కోప్ ఉంటుంది, ఉన్నా నటిగా ఎంతవరకు మ్యాజిక్ చేస్తుంది అనే సందేహం కలుగుతోంది. మరి శ్రీలీల అనుమానాలను పటాపంచలు చేసి వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందేమో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.