English | Telugu
గీతా మాధురితో విడాకులకు సిద్ధమైన నందు.. ఇది నిజమా?
Updated : Oct 21, 2023
టాలీవుడ్‌లోని రెండు శాఖల్లో తమ ప్రతిభను చాటుతున్న గీతా మాధురి, నందు ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. గాయనిగా గీతా మాధురి, నటుడిగా నందు తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. కెరీర్ పరంగా ఇద్దరికీ ఎలాంటి సమస్యలు లేవు. అయితే వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, త్వరలోనే విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఇద్దరూ పట్టించుకోలేదు. వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో ఇందులో నిజం ఉందని, అందుకే ఎలాంటి స్పందన లేదని అందరూ అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు విడాకులు తీసుకోవడం మనం చూశాం.
తాజాగా ఈ వార్తలపై నటుడు నందు స్పందించాడు. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ ‘మ్యాన్షన్ 24’లో నటించిన నందు ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘నేను, గీతా మాధురి విడాకులు తీసుకోబోతున్నామంటూ వస్తున్న వార్తలో ఎంత మాత్రం నిజం లేదు. ఇలాంటి వార్తలు మాకు కనిపించినపుడు మేము చాలా నవ్వుకుంటాం. మేమేంటో మాకు తెలుసు కాబట్టి ఇలాంటి రూమర్స్‌కు స్పందించాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి దానిపై క్లారిటీ ఇస్తున్నానంతే’’ అన్నాడు. నందు అఫీషియల్‌గా తమ విడాకుల వార్తలో నిజం లేదని చెప్పడంతో ఇప్పటివరకు వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పడిరది.