English | Telugu
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత చేస్తున్న సినిమాలో నాని హీరో!
Updated : Oct 21, 2023
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. జాతీయ అవార్డులతోపాటు ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్న ఈ సినిమాను డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించారు. ఈ సినిమా తర్వాత డి.వి.వి.దానయ్య నిర్మించే సినిమాలో నాని హీరోగా నటించబోతున్నాడు. నానికి ఇది 31వ సినిమా కావడం విశేషం.
తమ సంస్థ నిర్మించే సినిమాలో నాని హీరోగా నటించనున్నాడని డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్ ద్వారా ప్రకటిస్తూ వీడియో షేర్ చేసింది. థ్రిల్స్, చిల్స్, ఫన్ కోసం రెడీగా ఉండాలంటూ అభిమానులను సిద్ధం చేసింది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. దసరా సందర్భంగా అక్టోబర్ 24న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవుతుంది. ‘హాయ్ నాన్న’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారుతున్న నాని కొత్త సినిమా ఎనౌన్స్ చేయడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం.