English | Telugu

'షరతులు వర్తిస్తాయి' ఫస్ట్ లుక్ విడుదల చేసిన త్రివిక్రమ్

స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల, శ్రీష్ కుమార్ గుండా, కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాణంలో కుమార స్వామి(అక్షర) దర్శకత్వంలో చైతన్య రావు- భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ... మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి. షరతులు వర్తిస్తాయి చిత్రం కుటుంబ విలువలకు సంబంధించిన సినిమా. ఈ ప్రాంతం మట్టి నుంచి వచ్చిన కథ. ఇది మన కుటుంబ సంస్కృతిక విలువలతో నిండి ఉన్న సినిమా. ఇటువంటి మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ప్రోత్సహించాలి" అన్నారు.

చిత్ర హీరో చైతన్య రావు మాట్లాడుతూ... "మా సినిమా ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ను నాకు ఎంతో ఇష్టమైన దర్శకుడు త్రివిక్రమ్ గారు ఆవిష్కరించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇంత బిజీ లో కూడా మాకు సమయం కేటాయించి మమ్ములను ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు" అన్నారు.

చిత్ర దర్శకుడు కుమార స్వామి ( అక్షర ) మాట్లాడుతూ... "ఒక మంచి ఉద్దేశంతో తీసిన సినిమా. త్వరలోనే విడుదల కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ త్రివిక్రమ్ సార్ తో ఆవిష్కరించాలని నా కల అని అడిగిన వెంటనే సహాయ సహకారాలు అందించిన మామిడి హరికృష్ణ గారికి, అంగీకరించిన గురూజీ త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు" అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.