English | Telugu

రెండో సాంగ్ రిలీజ్ చేసిన అక్కినేని నాగార్జున 

కర్ణాటకలోని హళిబేడు, బేలూరులలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం శాంతల..ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలని నిర్మించిన కే ఎస్ రామారావు సమర్పణలో ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై శాంతల చిత్రం రూపుదిద్దుకుంది. అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఫ్యామిలీ మాన్ ఫేమ్ అశ్లేష ఠాకూర్ హీరోయిన్ గా నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వం లో వస్తున్న చిత్రం శాంతల. ఈ చిత్రంలోని రెండో పాట చెలి మోహమే అనే పాటను హీరో కింగ్ నాగార్జున విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా శాంతల చిత్రంలోని రెండో పాటని నాగార్జున గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నాగార్జునగారు రిలీజ్ చేసిన చెలి మోహమే పాటను ఎస్ పి బి చరణ్ పాడగా కృష్ణ కాంత్ సాహిత్యం అందించాడు. సీతారామం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రానికి సంచలన సంగీతం సమకూర్చిన విశాల్ చంద్రశేఖర్ ఈ శాంతల చిత్రానికి సంగీతాన్ని అందించారు. స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలని అందించాడు. నవంబర్ 17 న శాంతల చిత్రం విడుదల కాబోతుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.