English | Telugu

విశ్వక్‌ సేన్ చేతులమీదుగా 'తెరచాప' ఫస్ట్‌ లుక్‌ లాంచ్

నవీన్ రాజ్ సంకరపు, పూజా సుహాసిని శ్రీలు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'తెరచాప’. జోయల్‌ జార్జ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనన్యా క్రియేషన్స, హరితవనం ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకాలపై కైలాష్‌ దుర్గం నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా విశ్వక్‌ సేన్ మాట్లాడుతూ "ఈ సినిమా కథ, కథనం, టేకింగ్‌, నిర్మాణ విలువలు అన్ని విషయాలు నాకు తెలుసు. టైటిల్‌, పోస్టర్ డిజైనింగ్‌ చాలా బావుంది. సినిమా బాగా ఆడి ఈ టీమ్‌ కి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డీఓపీలుగా అజీమ్‌ - వెంకట్‌, ఆర్ట్‌ డైరెక్టర్ గా చరణ్‌, ఎడిటర్ గా బొడిసింగి రాజు వ్యవహరిస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం