English | Telugu

Director Puri Jagannath Health Condition: పూరి కొత్త లుక్‌.. అతని ఆరోగ్యంపై ఆందోళన!

టాలీవుడ్‌ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్‌ది ఒక విభిన్నమైన శైలి. రొటీన్‌ సినిమాలకు భిన్నంగా తన సినిమాల్లో కొత్తదనం ఉండాలని కోరుకుంటారు. ఆ పద్ధతిలోనే టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలతో సినిమాలు తీసి సూపర్‌హిట్‌ కొట్టారు. ఫ్లాప్‌ అయిన సినిమాలు కూడా టేకింగ్‌ పరంగా బాగుంటాయి. సినిమా హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా డైరెక్టర్‌గా తన హవా కొనసాగిస్తూనే ఉన్నారు. హీరోలకు ఫ్యాన్స్‌ ఉన్నట్టే.. పూరికి కూడా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇటీవల విజయ్‌ దేవరకొండతో చేసిన ‘లైగర్‌’ పూరిని తీవ్రంగా నిరాశపరచింది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఛార్మి, పూరి మధ్య గొడవలు జరిగాయని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ రూమర్సేనని తెలిసింది. ప్రస్తుతం రామ్‌ హీరోగా రూపొందిస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ బిజీలో ఉన్నాడు పూరి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’కి డబుల్‌ ఇంపాక్ట్‌ వచ్చేలా చిత్రీకరిస్తున్నాడు పూరి.

ఇదిలా ఉంటే.. పూరి ఫోటోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది ఛార్మి. ఆ ఫొటోలో పూరీ లుక్‌ చాలా వెరైటీగా, గుర్తుపట్టలేని విధంగా ఉంది. అసలు పూరీకి ఏమైంది? ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పూరి జగన్నాథ్‌ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .