English | Telugu

ఈ వారం పృథ్వీ ఎలిమినేషన్.. డబుల్ ఎలిమినేషన్ ఉంటే యష్మీ సర్దుకోవాల్సిందే!

బిగ్ బాస్ సీజన్-8 లో పన్నెండో వారం వీకెండ్ వచ్చేసింది. ‌ఇక ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో ఉంది. ఇక కన్నడ బ్యాచ్ అంతా నామినేషన్ లో‌ ఉండగా నబీల్ ఒక్కడు తెలుగోడు ఉన్నాడు.

ఇక ఓటింగ్ అనాలసిస్ చూస్తే నబీల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత నిఖిల్ సెకెంఢ్ ప్లేస్ లో ఉన్నాడు. కొన్ని పోల్స్‌లో నబీల్ టాప్‌లో ఉంటే.. మరి కొన్ని పోల్స్‌లో నిఖిల్ టాప్‌లో ఉన్నాడు. ఎలిమినేట్ కంటెస్టెంట్స్ వచ్చి నిఖిల్‌ని దోషిగా నిలబెట్టడంతో.. అతనికి మైనస్ ఎంత అయ్యిందో.. ప్లస్ కూడా అంతే అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే.. అతనికి తొలి నుంచి ఓటింగ్ గ్రాఫ్ ఎక్కువే ఉండటంతో.. ఈవారంలో కూడా సత్తా చూపిస్తున్నాడు. ఇక శుక్రవారం నాటి ఓటింగ్ పోల్ లో పృథ్వీ, యష్మీ ఇద్దరు లీస్ట్ లో ఉన్నారు. వీరికంటే ప్రేరణకి అత్యధిక ఓటింగ్ ఉంది.

ఇక కన్నడ బ్యాచ్ చేసే గ్రూపిజం కళ్ళకి కట్టినట్టుగా అనిపిస్తుంది. మన బిగ్ బాస్ మామ గురించి తెలిసిందేగా కంటెంట్ ఇచ్చే వాళ్లను, రౌడీయిజం చేసేవారిని, అందరు కలిసి నామినేషన్ ఎవరిని చేయాలో మాట్లాడుకునేవారినే హౌస్ లో ఉంచుతాడు. మిగతావాళ్ళని బయటకి పంపిస్తాడు. అవినాష్, టేస్టీ తేజ లాంటి ఎంటర్‌టైనర్స్ ని ఎలిమినేషన్ దాకా తీసుకొచ్చేస్తాడు. మరి ఈ వారమైన కన్నడ బ్యాచ్ లో వరెస్ట్ బిహేవియర్ తో ఉన్న పృథ్వీని పంపిస్తాడో లేక ఫ్లిప్పింగ్ స్టార్ యష్మీని ఎలిమినేషన్ చేస్తాడో చూడాలి మరి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే యష్మీ కూడా సర్దుకోవాల్సిందే.