English | Telugu

హన్సిక అంటే చిన్నప్పుడు క్రష్...

ఢీ సెలబ్రిటీ స్పెషల్ గ్రాండ్ ఫినాలే ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇందులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎంట్రీ ఊర మాస్ లెక్క ఉంది. ఇక హన్సికను చూసేసరికి విశ్వక్ మాములుగా డైలాగ్స్ వేయలేదు. హన్సిక ఇప్పటికీ స్వీట్ 16 లా ఉన్నారు. అసలు ఆవిడ ఏమీ మారలేదు. మా అబ్బాయితో కూడా ఆమె సినిమా చేసేంత స్వీట్ గా ఉన్నారు అంటూ లాస్ట్ లో ఆమెతో కలిసి డాన్స్ చేసాడు. చిన్నప్పుడు ఏ క్రష్ ఐతే హన్సిక మీద ఉండేదో అది ఇప్పుడు ఆమెతో డాన్స్ చేసాక తీరిపోయింది అని చెప్పాడు.

ఇక ధమ్కీ షూటింగ్ విషయాలు గుర్తొస్తున్నాయంటూ ఆది గురించి చెప్పుకొచ్చాడు. థాయిలాండ్ లోని ఒక హోటల్ లో స్టే చేసినప్పుడు జరిగిన విషయాలను చెప్పుకొచ్చాడు. ఆ టైములో సాయంత్రం అయ్యేసరికి రెండు గంటల పాటు ఎవరికీ కనిపించకుండా మాయమైపోయేవాడు అది అని చెప్పాడు . ఇక శేఖర్ మాస్టర్ ఐతే విశ్వక్ ఆ సీక్రెట్ ఏంటో చెప్పవా అనేసరికి "రోజూ సాయంత్రం ఆదితో కలిసి డిన్నర్ చేద్దామనుకునేవాడిని కానీ ఆది డిన్నర్ చేయడానికి బయటకు వెళ్లిపోయేవాడు" అని చెప్పాడు. ఇక చిట్టి మాష్టర్ కోరియోగ్రఫీ చూసాకా అందరూ ఫిదా ఇపోయారు. సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటూ నందూ చెప్పుకొచ్చాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.