English | Telugu

Brahmamudi : కోడలి కోసం ఇంట్లో నుండి బయటకొచ్చేసిన అత్త.. ఆ లెటర్ లో ఏం ఉందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -574 లో..... రాజ్ ఇంటికి రాగానే స్వప్న వాళ్లు మా కావ్య ఎక్కడ అని అడుగుతారు. మీ ఇంటికి వెళ్ళిందని రాజ్ అంటాడు. అంటే ఇంకా అర్ధం కాలేదా ఈ పోటీలో నేనే గెలిచానని రాజ్ అంటాడు. అపర్ణ, ఇందిరాదేవి, స్వప్న లు డిస్సపాయింట్ అవుతారు. కంగ్రాట్స్ అంటూ రాజ్ కి రుద్రాణి చెప్తుంది. థాంక్స్ అత్త.. పాట పెట్టు డాన్స్ చేద్దామని అనగానే రుద్రాణి సాంగ్ పెట్టగానే రాజ్ డాన్స్ చేస్తుంటాడు.

అప్పుడే సీతారామయ్య వస్తాడు. నీది ఒక గెలుపేనా అని.. రాజ్ మోసం చేసి గెలిచాడన్న విషయం చెప్పగానే అందరు షాక్ అవుతారు. మీరే కదా గెలవడానికి ఏదైనా చెయ్యొచ్చు అన్నారని రాజ్ అంటాడు. ఆ కావ్య అక్కడ సైలెంట్ గా ఉండి నీకు చెప్పిందా అని రాజ్ అంటాడు. నీకు రాహుల్ కి పెద్ద తేడా ఏముందని స్వప్న అంటుంది. నువ్వు ఇలా చేస్తావనుకోలేదని అపర్ణ అంటుంది. న్యాయంగా అయితే కావ్య గెలిచింది. వెళ్లి తనని తీసుకొని రమ్మని చెప్తారు. నేను విడాకులు అయిన ఇస్తాను కానీ తీసుకొని రానని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య భోజనం చేస్తుంది. ఓడిపోయినందుకు నీకేం బాధ లేదా అని కనకం అంటుంది. అప్పుడే సీతారామయ్య ఫోన్ చేస్తాడు. కావ్య స్పీకర్ లో పెట్టి మాట్లాడుతుంది . గెలుపు నీది అయితే వాడు మోసం చేసి గెలవడం ఏంటని సీతారామయ్య అనగానే.. నేను పోటీలో ఓడిపోతే కంపెనీ నుండి ఆయన జీవితం నుండి వెళ్ళిపోతానని తెలిసి కూడా అలా చేశారంటే నేను అంటే ఇష్టం లేదని కదా.. నాకు డిజైన్ దొంగతనం చేసి టేబుల్ కింద ఉన్నప్పుడే తెలుసు కానీ ఆయనకి ఇష్టం లేకుండా నేనేం చేస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి ఇది జరిగిందని కనకానికి కావ్య చెప్తుంది.

మరొకవైపు అపర్ణ, ఇందిరాదేవి సుభాష్ లు మాట్లాడుకుంటారు. అప్పుడే కనకంకి ఫోన్ చేసి మీ మనవడు ఇలా చేసాడు. నా కూతురికి న్యాయం చెయ్యండని కనకం అనగానే.. అపర్ణ ఫోన్ తీసుకొని చేస్తానంటుంది. తరువాయి భాగంలో అపర్ణ కోసం ఇంట్లో వెతుకుతారు. తన లెటర్ రాసి పెట్టి వెళ్తుంది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే కావ్య వాళ్ళింటికి అపర్ణ బ్యాగ్ తో సహా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.