కావ్యశ్రీని పటాయిస్తున్న సుడిగాలి సుధీర్
ఫామిలీ స్టార్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర స్టార్స్ అంతా సందడి చేశారు. అమర్ దీప్, తేజస్విని గౌడ, రీతూ చౌదరి, మానస్, భానుశ్రీ, కావ్య, అష్షు రెడ్డి, భోలే షావలి, వర్ష, పాగల్ పవిత్ర వంటి వాళ్లంతా వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇక షో ఎంట్రీలో ఒక్కో లేడీ స్టార్ గురించి షో హోస్ట్ సుడిగాలి సుధీర్ తెగ బిల్డప్ ఇచ్చాడు. ఇక ఈ షోలో గోరింటాకు సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న కావ్యశ్రీని పటాయించాడు సుడిగాలి సుధీర్. ఇటు రండి అంటూ కావ్యశ్రీని స్పెషల్ గా పక్కకు తీసుకెళ్లి తన చేతిలోని సెల్ ని విసిరిపారేసాడు.