English | Telugu

Prithvi Elimination: పృథ్వీ ఎలిమినేషన్ తో విష్ణుప్రియ ఎమోషనల్..

బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి సండే ఫండే ఎపిసోడ్ లో పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్స్‌లో చివరిగా మిగిలి పోయిన పృథ్వీ విష్ణు యాక్షన్ రూమ్‌కి వచ్చేయండంటూ నాగార్జున చెప్పారు. ఇక ఇద్దరి ముందు రెండు అక్వేరియంలు ఉన్నాయి. వీటిలో ముందుగా నెం 1 అని రాసిన లిక్విడ్ వేయాలంటూ నాగ్ చెప్పారు. అది వెయ్యగానే అక్వేరియంలో వాటర్ ఎల్లో కలర్‌లోకి మారిపోయింది. తర్వాత నెం. 2 లిక్విడ్ వేయాలి.. అది వేశాక ఆ నీళ్లు రెడ్‌లోకి మారితే వాళ్లు ఎలిమినేట్ అంటూ నాగార్జున చెప్పగా.. పృథ్వీ వాటర్ రెడ్ కాగా విష్ణు అక్వేరియంలో నీళ్లు ఎల్లోగా ఉన్నాయి. దీంతో పృథ్వీ యూ ఆర్ ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున ప్రకటించారు.

దెయ్యాలను చూడడానికి చంద్రగిరి కోటకు వెళ్లిన గీతూ

గీతూ మోటివేషనల్ వీడియోస్ తో బాగా ఫేమస్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లొచ్చాక ఇంకా ఫేమస్ అయ్యింది. అలాంటి గీతూ దెయ్యాలు సంబంధించి ఒక విషయం చెప్పింది. చిట్ చాట్ విత్ బిగ్ బాస్ టీం 2 పేరుతో వచ్చిన ఒక చాటింగ్ లో ఈ దెయ్యాల విషయాలను షేర్ చేసుకుంది. " నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చంద్రగిరి కోటకు స్కూల్ లో ఎక్స్కర్షన్ కి తీసుకెళ్లారు. అప్పుడు నాకు దెయ్యాలని చూడాలనిపించింది. కోటలో దెయ్యాలు ఉంటాయని అప్పట్లో ఎవరో చెప్పారు అందుకే చూద్దామనిపించింది. అందుకే 4 గంటల తర్వాత దెయ్యాలుంటాయంట చూసి వెళదాం ఎవరికీ చెప్పొద్దూ మనం అని అక్కడ ఎవరికీ కనిపించకుండా ఒక చోట దాక్కుని ఉన్నాం నేను నా ఫ్రెండ్. ఆరోజు రాత్రి 7 గంటల వరకు అక్కడే దెయ్యాల కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ టైంకి కోట మొత్తం ఒక్కసారిగా చీకటైపోయింది.