English | Telugu

Illu illalu pillalu : నర్మద, సాగర్ ల ప్రేమ పెళ్ళికి రామరాజు ఆశీస్సులు.. అసలు నిజం అదే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -22 లో... సాగర్ ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో నర్మద డైరెక్ట్ గా ఇంటికి వస్తుంది. దాంతో కంగారుగా సాగర్ బయటకు వచ్చి.. నర్మదతో మాట్లాడతాడు. ఇప్పుడైనా వీళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. మీ వాళ్ళని తీసుకొని వచ్చి మా వాళ్ళతో మాట్లాడమంటే నీకు అర్థం కాదా అని నర్మద కోప్పడుతుంటే.. మా నాన్న అంటే భయమని సాగర్ అంటాడు. అంత భయపడేవాడివి ఎందుకు ప్రేమించావు.. నువ్వు నాతో టైమ్ పాస్ చేసావని నర్మద అనగానే సాగర్ కోప్పడతాడు.. రేపు పెళ్లి చేసుకుందాం నువ్వు రెడీనా అని అనగానే.. నాకు ఇష్టమేనని నర్మద అంటుంది.

Brahmamudi: హాస్పిటల్ బెడ్ పై పెద్దాయన.. ఎస్సై ట్రైనింగ్ కి అప్పు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్  శుక్రవారం నాటి ఎపిసోడ్- 586 లో.. సీతారామయ్య హాస్పిటల్ లో ఉండగా.. అందరు బయట ఉంటారు. కావ్యని లోపలికి రమ్మని పిలుస్తాడు సీతారామయ్య. తను రాగానే..  అమ్మా కావ్యా అంటూ ఆక్సిజన్ మాస్క్ తీసి మాట్లాడటం మొదలుపెడతాడు సీతారామయ్య. తాతయ్యా మీకు ఆక్సిజన్ అందకపోతే మళ్లీ ఇబ్బంది అవుతుందని కావ్య అంటుంది. పర్వాలేదమ్మా.. కూర్చో.. నేను మళ్లీ నీతో మాట్లాడతానో లేదో ఏం చెప్పినా ఇప్పుడే చెప్పనివ్వు అమ్మా అని సీతారామయ్య అంటాడు. అలా మాట్లాడకండి తాతయ్యా.. మీకు ఏదైనా అయితే మీ చిట్టీ (ఇందిరా దేవి) ఏమైపోతుంది? ఇప్పటికే ఈ బావ కోసం గుండె గుప్పెట్లో పెట్టుకుని బయట ఏడుస్తూ కూర్చుందని కావ్య అంటుంది. మేము ఆకలిగా ఉన్నామని తెలిసి వాడు మాట్లాడకపోయినా అన్నం తెచ్చి పెట్టిన దానివి.. నేను లేకపోయినా నువ్వు చిట్టీని చూసుకోగలవు కదమ్మా అని సీతారామయ్య అనగా.. మీరు అలా మాట్లాడకండి తాతయ్యా. మీరు మీ చిట్టి కోసమే కాదు.. ఈ మనవరాలి కోసం మీ మనవడి కోసం క్షేమంగా తిరిగి వస్తారని కావ్య అంటుంది.

మేకప్ తీసేసాను...చూసారా ఎలా ఉన్నానో  

ఆట సందీప్ వైఫ్ జ్యోతి రాజ్ గురించి అందరికీ తెలుసు. ఆమె కూడా డాన్సర్ ..ఆట సందీప్ తో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరూ కలిసి రకరకాల షోస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. జ్యోతి రాజ్‌పై  ఈమధ్య బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు కొంతమంది నెటిజన్స్..మీది నాచురల్ బ్యూటీ కాదు. మీరు అందంగా ఉండరు అంటూ ఇలా అన్నమాట. ఐతే జ్యోతి దీని మీద ఒక వీడియో చేసింది. వీడియోలోనే తన మేకప్ ని తీసేస్తూ అలాగే ఫేస్ మొత్తాన్ని రబ్ చేస్తూ చూసారా..మేకప్ లేకుండా చూడలేము అన్న వాళ్ళ కోసమే ఈ వీడియో. పర్లేదు..కొంచెం బాగుంటాను కాబట్టే మా ఆయన చేసుకున్నాడు. కొంచెం అంతో ఇంతో పర్లేదు.

టిసిఎస్ లో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ టు జబర్దస్త్...అక్కడి నుంచి బిగ్ బాస్...టేస్టీ తేజ జర్నీ ఇదే...

కమెడియన్ గా తేజ గురించి అందరికీ తెలుసు మరి ఏంటి అందరూ టేస్టీ తేజా అంటారు..ఎలా ఆ పేరు వచ్చింది అని అడిగేసరికి దాని హిస్టరీ మొత్తం చెప్పుకొచ్చాడు తేజ ఒక ఇంటర్వ్యూలో. "టేస్టీ తేజ అనేది నా యూట్యూబ్ ఛానల్ పేరు. ఇందులో సినీ సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూస్ చేస్తూ ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను షెఫ్ ని కూడా.. రకరకాల ఫుడ్ కూడా వండుతాను. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మొత్తం నాలుగు భాషలకు సంబంధించి 150 కి పైగా యాక్టర్స్ తో మూవీ ప్రమోషన్స్ చేసిన ఏకైక యూట్యూబర్ ని నేను. డైరెక్టర్స్, యాక్టర్స్, కమెడియన్స్, సింగర్స్ తో అందరితో ఇంటర్వ్యూస్ చేశా. అలాగే తెలుగు ఇండస్ట్రీ 90 ప్లస్ మూవీస్ ని ప్రమోట్ చేశా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా. అసలు ఈ ఐడియా నాకు రావడం నేను దాన్ని అమలు చేయడం అది క్లిక్ అవడం లక్ అని చెప్పాలి.