English | Telugu

Brahmamudi : ఆస్తిని ముక్కలు చేయాలన్న కోడలు.. కుప్పకూలిన ఇంటి పెద్దాయన!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -585 లో....కళ్యాణ్ బయటకు వెళ్తుంటే.. అప్పు దగ్గర ఉండి రెడీ చేస్తుంది. అప్పుడే అనామిక వస్తుంది. టీ, కాఫీ లు అందించడానికి వెళ్తున్న భర్తని బానే రెడీ చేస్తున్నావని అనామిక అనగానే.. అప్పు ఆశ్చర్యంగా చూస్తుంది. కళ్యాణ్ రైటర్ లక్ష్మీకాంత్ దగ్గర పని చెయ్యడానికి వెళ్తున్నాడని అనామిక చెప్తుంది. అప్పుకి కళ్యాణ్ చెప్పిన అబద్ధం అనామిక చెప్పి వెళ్ళిపోతుంది. నీకు ఆ విషయం చెప్తే బాధపడతావని చెప్పలేదు కానీ నీకు అబద్దం చెప్పాలని కాదని కళ్యాణ్ అనగానే.. అప్పు అర్ధం చేసుకుంటుంది.

వైల్డ్ ఫైర్ తో కిర్రాక్ సీత...

కిర్రాక్‌ సీత బేబీ మూవీతో ఫుల్ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళొచ్చింది. బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక ఇంకా పాపులర్ అయ్యింది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.  7ఆర్ట్స్ యూట్యూబ్‌ చానెల్‌లో  తనదైన కామెడీ, ఫన్నీ వీడియాలతో ఆకట్టుకునేది సీత..ఈ ఛానెల్ ద్వారా ఆమెకు కొంత గుర్తింపు వచ్చింది. కానీ బేబీ మూవీతో ఇప్పుడు జనాలందరికీ తెలిసింది. అలాంటి సీత వైల్డ్ ఫైర్ తో ఫోటో దిగి ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది. "ఐకానిక్ స్టార్ తో ఫోటో దిగడం నిజంగా అనుకోలేదు. ఎం నటించారు సర్ మూవీలో.. బేబీ మూవీలో నా యాక్టింగ్ బాగుంది అని మీరు చెప్పడం నిజంగా ఐకానిక్ మెమరీ నాకు.

Karthika Deepam2 : దీపని చంపాలనుకున్న జ్యోత్స్న.. చెట్టుకి ఢీ.. తలకి గాయం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -219 లో... దీపకి తెలియకుండా శౌర్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటాడు కార్తీక్. కానీ దీప కూడా కార్తీక్ తో హాస్పిటల్ కి వెళ్తుంది. దీప, కార్తీక్ లు హాస్పిటల్ కి రావడం చూసిన జ్యోత్స్న కోపంతో ఉంటుంది. డాక్టర్ దగ్గరికి కార్తీక్ వెళ్తాడు. అప్పుడే  దీపకి ఎవరో చేసినట్టుగా జ్యోత్స్న గొంతు మర్చి ఫోన్ చేస్తుంది. సరిగ్గా వినపడకపోవడంతో అప్ప్పుడే కార్తీక్ వచ్చి సిగ్నల్ లేనట్టుంది బయటకు వెళ్లి మాట్లాడమని అనగానే దీప వెళ్తుంది. దాంతో  శౌర్యని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కార్తీక్.

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి విడాకుల గురించి నిజం తెలుస్తుందా.. సవతి తల్లి మరో ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -270 లో.. శ్రీలతకి నందిని ఫోన్ చేసి.. మీరు ఇలా ఏం ప్లాన్ చెయ్యకుండా ఉంటే ఎలా? నా సీతా నాకు దూరం అవుతున్నాడనిపిస్తుంది.. రామలక్ష్మి వాలకం చూస్తుంటే ఏదో ప్లాన్ లో ఉన్నట్టు ఉంది అందుకే నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ రామలక్ష్మి ని లేకుండా చేస్తానని నందిని అంటుంది. శ్రీవల్లి ఫోన్ లాక్కొని నీకంటే ఆస్తులున్నాయ్. మాకు బావ గారి ఆస్తులు తప్ప ఏం లేవు. ఇప్పుడు ఆస్తులన్నీ రామలక్ష్మి పేరు మీదే ఉన్నాయ్ తనని చంపేస్తే ఆస్తులన్నీ ఎలా అని శ్రీవల్లి అంటుంది.

అవార్డులు, అవకాశాలు పక్క రాష్ట్రాల నటీనటులకు...చప్పట్లకు మాత్రమే తెలుగువాళ్లు

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతా తెలుగు వాళ్ళే నటించేవాళ్ళు. తర్వాత టాలీవుడ్ లో ఎన్నో మార్పులు వస్తూ వచ్చాయి. దాంతో అటు మూవీస్ లో కావొచ్చు ఇటు సీరియల్స్ లో కావొచ్చు అంతా వేరే రాష్ట్రాల వాళ్ళు వేరే దేశాల వాళ్ళు వచ్చి నటించడం స్టార్ట్ అయ్యింది. లోకల్ వాళ్ళు మాత్రం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఈ సంస్కృతీ మరీ  ఎక్కువైపోయింది. ఐతే రీసెంట్ గా ఈ అంశం మీద టీవీ సీరియల్స్ లో నటించే శ్రావణి కూడా ఈ విషయాలను చెప్పుకొచ్చింది. ఐతే ఇక్కడ తెలుగు వాళ్లకు వేరే భాషల వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు.

జ్యోతిని చూస్తుంటే ఇలియానాని చూస్తున్నట్టు గా ఉంది

జ్యోతి పూర్వజ్ అంటే తెలీకపోవచ్చు కానీ గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం అంటే టక్కున  గుర్తొచ్చేస్తుంది. ఆమె సోషల్ మీడియాకే హీట్ పుట్టించే హీరోయిన్ మెటీరియల్.. ఆమె పెట్టే వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ వేలల్లో, లక్షల్లో వ్యూస్ వెళ్తూ ఉంటాయి. ఆమె స్ట్రక్చర్ కానీ ఆమె ఫేస్ కానీ నెటిజన్స్ కి బాగా నచ్చుతాయి. దాంతో ఆమె ఏ వీడియో పెట్టినా వందల కొద్దీ మెసేజెస్ ని కుమ్మరిస్తూ ఉంటారు. అలాంటి జ్యోతి రీసెంట్ గా ఒక వీడియోని పోస్ట్ చేసింది. అది కూడా ఓల్డ్ హిందీ సాంగ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. " ఓఓ జానే జానా" అనే సాంగ్ కి జ్యోతి డాన్స్ ఇరగదీసేసింది. వేసింది చిన్న స్టెప్స్ కానీ ఆ గ్రేస్ వేరే లెవెల్.