English | Telugu

బిగ్ బాస్ కోసం రెండు సినిమాలు వదిలేసా...

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది అదేంటంటే చంద్రమోహన్ ఏ హీరోయిన్ పక్కన నటిస్తే ఆమె సూపర్ డూపర్ హిట్ ఐపోయి ఫుల్ ఫేమస్ ఐపోతారు. ఐతే ఇప్పుడు ఇలాంటి ఒక కాన్సెప్ట్ టేస్టీ తేజ విషయంలో జరిగింది. అందుకే తెగ ఫీలైపోతున్నాడు. పాపం పెళ్లి చేసుకుందామని అమ్మాయిలను చూస్తున్నా కానీ ఎవరూ తనని చూడడం లేదట. బిగ్ బాస్ సీజన్ 7 లో శోభా శెట్టిని చూసాడు ఆమె ఎంగేజ్ ఐపోయింది. ఈ సీజన్ లో ప్రేరణని చూశాడట ఆల్రెడీ పెళ్లయిపోయింది అంటూ పాపం తన కోసం ఎవరైనా అమ్మాయి ఉందా లేదా అన్న రేంజ్ లో బాధపడుతున్నాడు. అందుకే పాపం బిగ్ బాస్ ని రెండు చేతులు జోడించి ఒక కోరిక కోరుకున్నాడు.

సుమ కన్నా ఆ విషయంలో జాను చాలా బెటర్...అన్ని మిలియన్స్ వ్యూసా..షాకైన సుమ

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోకి ఢీ డాన్సర్స్ వచ్చారు. అన్వేష్ , రాము రాథోడ్, ప్రేమ్ రంజిత్, శ్రేయ, మైథిలి, జానులూరి వచ్చారు. ఢీ డాన్స్ లో ఉన్నప్పుడు శేఖర్ మాష్టర్ కానీ మిగతావాళ్లంతా కూడా జానునీ బాగా హైప్ చేశారు ఇక ఇప్పుడు  సుమ అడ్డాలో కూడా సుమ బాగా హైప్ చేసేసింది జానునీ. "జానూ నువ్వు చేసిన పెర్ఫార్మన్సెస్ లో మొత్తం ఎన్ని మిలియన్స్ వచ్చాయి అని అడిగింది. 200 , 250 మిలియన్స్ వెళ్లాయి అనేసరికి నా అన్ని షోస్ కూడా కలిపితే అన్ని వ్యూస్ కూడా వెళ్లి ఉండవు కదా అంటూ తన మీద తానె సెటైర్ వేసుకుంది సుమ. ఇక ఇందులో సుమ గ్రామీణ బ్యాంక్ పేరుతో ఒక స్కిట్ వేసింది.

ఎలాగైనా పొట్ట తగ్గించి నాగ్ సర్ టీ షర్ట్ తెచ్చుకుంటా...

బిగ్ బాస్ సీజన్‌ 8లో టేస్టీ తేజా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఈ సీజన్ ని సస్టైన్ చేయడం కోసం కొత్త ప్లాన్ వేసాడు. జనరల్ గా  పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ ఎలా ఐతే కలుసుకుంటూ ఉంటారో ఆ కాన్సెప్ట్ ని తెరమీదకు తీసిచ్చాడు. అలాగే ఓల్డ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో కొంతమందిని హౌస్ లోకి తెచ్చి రేటింగ్స్ కోసం ప్రయత్నించాడు. బిగ్ బాస్ చరిత్రలో ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం. అది సక్సెస్ కొట్టింది. ఇక తేజ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక మీడియాకి కొన్ని విషయాలను చెప్పాడు.  "బిగ్ బాస్ 7 లో మేమంతా బాగా ఆడాం..గౌతమ్ కానీ నిఖిల్ కానీ బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా రోహిణి విన్ ఐతే ఇంకా బాగుంటుంది.

రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు..అన్న మాటకు సీరియస్ ఐన యాంకర్ ఝాన్సీ

ఆహాలో స్ట్రీమ్ అవుతున్న కాకమ్మ కథలు ఎపిసోడ్ లో తేజస్వి హోస్ట్ గా చేస్తూ  వచ్చే సెలబ్రిటీస్ ని ముప్పుతిప్పలు పెట్టె ప్రశ్నలు అడిగి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఐతే రీసెంట్ గా అలనాటి యాంకర్ ఝాన్సీ ఆమె కూతురు ధన్య ఎంట్రీ ఇచ్చారు. ధన్య వయసు ఇప్పుడు  22. అని చెప్పేసరికి తేజు తన వయసు 33 అని చెప్పింది. ఇక ధన్య హైట్ 5’9 అని చెప్పింది. ఇండస్ట్రీలో పొడుగైన హీరోయిన్ గా ఈఫిల్ టవర్ అంత ఎత్తు అవుతావనుకుంటా అంటూ కామెడీ చేసింది తేజు. ఇక ధన్యకి సిగ్గు కూడా చాలా ఎక్కువే..సిగ్గు పడుతూనే ఆన్సర్స్ చెప్పింది. ఇక తేజస్విని కూడా ఝాన్సీని ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగింది. "మీరు రెండో పెళ్లి ఎప్పుడు  చేసుకుంటున్నారు.. ? " అని అడిగేసరికి దానికి ఝాన్సీ సీరియస్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చినట్టు ఈ ప్రోమోలో చూపించారు.